Homeఎంటర్టైన్మెంట్Rajamouli-Mahesh: రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్న సూపర్ స్టార్...క్యారెక్టర్ ఏంటంటే..?

Rajamouli-Mahesh: రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్న సూపర్ స్టార్…క్యారెక్టర్ ఏంటంటే..?

Rajamouli-Mahesh: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా ఒక పాన్ వరల్డ్ సినిమా రాబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు అభిమానులే కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే రాజమౌళి ఇంతకుముందు తీసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక దాంతో ప్రేక్షకులు అందరూ కూడా రాజమౌళి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి నుంచి ఒక సినిమా రావడానికి లేట్ అవుతుందేమో కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ నిరీక్షణకు మించి మనకు ఒక సంతృప్తి అనేది దొరుకుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రతి సీను కూడా చాలా అద్భుతంగా తెరకెక్కిస్తు స్క్రీన్ మీద ఒక విజువల్ వండర్ ని చూపించడంలో తను ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు.

ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా అలానే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి రాజమౌళి అడ్వెంచర్ జానర్ ను ఎంచుకున్నాడు. ఎందుకంటే హాలీవుడ్ స్టాండర్డ్ తో సినిమా తీయాలి అంటే అడ్వెంచర్ జానరైతేనె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఆ జానర్ ను ఎంచుకున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అందులో ఒకటి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నా క్యారెక్టర్ కాగా, మరొకటి హీరో పాత్ర అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ఈ డ్యూయల్ రోల్ మేకప్ కోసం హాలీవుడ్ మేకప్ మ్యాన్స్ చేత మేకప్ వేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ వీడియోని ఆరోజు రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Rajinikanth Biopic

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...
Nagarjuna

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...
Ram Charan long break after Peddi

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...
Chennai Love Story Movie

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...
Oktelugu Epaper