Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోతోంది. కానీ మనం టాప్ లో ఉన్నప్పుడు ఇతరులకు హెల్ప్ చేయాలంటే మాత్రం దానికి మానవత్వం ఉండాలి… సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరోగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వాళ్ళ నాన్న కృష్ణగారిని మించి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నాడు. అలాంటి మహేష్ బాబు తన కొడుకు అయిన గౌతం కృష్ణ చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ తో పుట్టాడని అతనికి సర్జరీ చేయించాడు. అప్పుడు మహేష్ బాబు కి ఒక గొప్ప థాట్ వచ్చింది. డబ్బులున్నాయి కాబట్టి నా కొడుకును నేను కాపాడుకున్నాను… మరి పేదవాళ్ల పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన మహేష్ బాబు చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ వస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన 5000 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించినట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే ఆయన దయ గుణాన్నీ తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు జనాలు సైతం మహేష్ బాబు నువ్వు దేవుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే మహేష్ బాబు చేసిన ప్రతి సినిమా ఎంత పెద్ద సక్సెస్ ను సాధించిందో మనందరికి తెలిసిందే.
ఇక దాంతోపాటుగా ఆయన మానవత్వాన్ని చాటుతూ చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయడంతో ఆయన చాలామందికి సేవలు చేస్తున్నాడు అంటూ చాలామంది కీర్తిస్తున్నారు. వాళ్ల ఫాదర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ సైతం ఒకప్పుడు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేవాడు.ఇక తండ్రికి తగ్గ తనయుడుగా మహేష్ బాబు అటు సినిమాల్లో రాణిస్తూనే ఇటు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమాతో ఆయన పాన్ వరల్డ్ లో కూడా చాప గొప్ప గుర్తింపును పొందుతాడు. అందుకే ఈ సినిమాను చాలా స్పెషల్ గా తీసుకొని చేస్తున్నాడు…రాజమౌళి సైతం ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ ను సాధించాడు. కాబట్టి ఇక మీదట చేయబోతున్న సినిమాలతో అంతకు మించి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…