Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం K ర్యాంప్(K Ramp Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఆయన బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నాడు. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా కూడా బాగానే వచ్చిందని అంటున్నారు. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న కిరణ్ అబ్బవరం, క చిత్రం తో సూపర్ హిట్ కొట్టి మంచి కం బ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా తర్వాత విడుదలైన దిల్ రూబ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో స్క్రిప్ట్ సెలక్షన్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన కిరణ్ అబ్బవరం, ఈ చిత్రం తో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేసాడు. మరి ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారు అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో హీరో కిరణ్ అబ్బవరం, తన డైరెక్టర్ జైన్స్ నాని తో కలిసి చాలా డిఫరెంట్ పద్దతి లో ప్లాన్ చేసాడు. సాధారణంగా కిరణ్ అబ్బవరం తన ప్రతీ సినిమాకు ఇదే రేంజ్ ప్రొమోషన్స్ చేస్తుంటాడు, ఈ సినిమాకు కూడా అదే ట్రెండ్ ని అనుసరించాడు. కాసేపటి క్రితమే ఆయన సోషల్ మీడియా లో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో లో డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఇందులో వీళ్లిద్దరు దేవుడి ముందు నిల్చొని మాట్లాడుతూ ‘కొన్ని గంటల్లో మన సినిమా విడుదల అవ్వబోతోంది. ఏంటి నాని పరిస్థితి?’ అని అడగ్గా, దానికి నాని సమాధానం చెప్తూ ‘నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను మామా’ అని అంటాడు.
అప్పుడు కిరణ్ అబ్బవరం ‘ఒకవేళ సినిమా ఫలితం తేడా అయితే?’ అని అడగ్గా, ‘దేవుడి ముందు అవేమి మాటలు మామా’ అని నాని అంటాడు. దానికి కిరణ్ అబ్బవరం కౌంటర్ ఇస్తూ ‘కనీసం దేవుడి ముందు అయినా నిజం చెప్తావేమో అని చూస్తున్నాను’ అని అంటాడు.’తేడా అయితే ఏముంది అన్నా..మా బుచ్చి రెడ్డి పాలెం కి వెళ్లి, కొన్నాళ్ళు రిలాక్స్ అయ్యి, మళ్లీ తిరిగొస్తా’ అని అంటాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది కిరణ్ అబ్బవరం మాటల్ని చూసి, అదేంటి సినిమా బాగా రాలేదా?, ఎందుకు అంత అపనమ్మకంగా మాట్లాడుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి ఏమి జరగబోతుందో..ఈరోజు విడుదలైన రెండు సినిమాల్లో ఒక దానికి పాజిటివ్ టాక్ రాగా, మరో చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రేపు K ర్యాంప్ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, ఈ ఊపు లో కచ్చితంగా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Om Namo Venkatesaya Namaha
See you in theatres tomorrow #KRamp pic.twitter.com/ZdzH1c3RAW
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 17, 2025