OG Suvvi Suvvi Song: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ని పక్కన పెడితే, కొన్ని చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి జానీ. వరుసగా ఆరు సూపర్ హిట్ సినిమాల తర్వాత యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న సమయం లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రమిది. ఇప్పుడు అందరూ ఓజీ చిత్రం వేరే లెవెల్ హైప్ తో రిలీజ్ అయ్యిందని అంటున్నారు కానీ, జానీ మూవీ కి ఉన్న హైప్ లో మనం చూసిన ఓజీ మూవీ హైప్ కేవలం పది శాతం మాత్రమే. అంతటి భారీ హైప్ తో వచ్చిన ఓజీ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. సింక్ సౌండ్ అనే కొత్త టెక్నాలజీ ని ఉపయోగించి స్పాట్ డబ్బింగ్ చెప్పడం వల్ల ఈ సినిమాలోని డైలాగ్స్ ఆరోజుల్లో ఆడియన్స్ కి అసలు అర్థం అవ్వలేదు.
చాలా వరకు సన్నివేశాలు రీ రికార్డింగ్ చెయ్యలేదు. అది స్పష్టంగా మనకి సినిమా చూస్తున్న సమయం లోనే అర్థం అవుతుంది. మంచి స్టోరీ, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ బాగుంది, టేకింగ్, పాటలు, ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే అత్యంత స్లో గా ఉండడంతో అప్పటి ఆడియన్స్ ఈ చిత్రానికి కనెక్ట్ అవ్వలేకపోయారు. కానీ హాలీవుడ్ లవ్ స్టోరీస్ ని నచ్చే వాళ్లకు ఈ సినిమాకు తెగ నచ్చేసింది. కేవలం ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు లక్షల్లోనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే సుజీత్. ఆయన దర్శకత్వంలో రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూశాము. చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఫలితం మంచి ఊపుని ఇచ్చింది.
ఈ సినిమా ని తెరకెక్కించడానికి ప్రేరణ జానీ చిత్రమే అని డైరెక్టర్ సుజీత్ అనేక ఇంటర్వ్యూస్ లో తెలపడం మనమంతా చూసాము. ఓజీ చిత్రం లో కూడా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ లో జానీ అనే తుపాకీ ని చూపిస్తాడు సుజీత్. దీనిని బట్టీ ఆయనకు జానీ సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ సినిమాలో ఉన్న ఏకైన సాంగ్ ‘సువ్వి సువ్వి’ కూడా జానీ సినిమాలోని విజువల్స్ కి స్పూఫ్ అని నిన్న ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని రెండు సినిమాల్లోనూ క్లిప్స్ ని జత చేసి చూపిస్తే కానీ ఫ్యాన్స్ కి తెలియలేదు, ఈ పాట చిత్రీకరణ కూడా జానీ సినిమా పాటల విజువల్స్ ని ఆధారంగా తీసుకొని చేసిందే అని. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.