Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లాంటి నటుడు తను చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్న ఆయన ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు వాళ్లు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక బెస్ట్ కథను ఎంచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లోనే చేయనటువంటి ఒక బెస్ట్ కథతో తన తదుపరి సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఇప్పటికే హాలీవుడ్ డైరెక్టర్లు సైతం అతన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఆయన తదుపరి సినిమాని హాలీవుడ్ డైరెక్టర్లతో చేస్తాడా లేదంటే తెలుగు డైరెక్టర్లతోనే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా విషయంలో ఈయన చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాడు.
మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళికి ఎంతటి గొప్ప గుర్తింపు వస్తుందో మహేష్ బాబుకి అంతకు మించిన గుర్తింపు అయితే వస్తుందని చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీ రాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడం సినిమాకు చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం…మరి మహేష్ బాబు తన అడుగులు హాలీవుడ్ దర్శకుల వైపు వేస్తాడా? లేదంటే తెలుగు దర్శకులతోనే చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…