Mahesh Babu
Mahesh Babu : ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న క్రమంలో కొంతమంది స్టార్ హీరోలు మాత్రం పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఇక మహేష్ బాబు సైతం సూపర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకొని మంచి సినిమాలను చేస్తూ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తున్నాడు. ఇక మీదట తను చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానమైతే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పాలి. ఆయన చేసే ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ లో సైతం తన సత్తా చాటుకుంటుంది. 2013 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లను సంపాదించడమే కాకుండా మల్టీస్టారర్ సినిమాల హవాకి తేరలేపింది. ఇక ప్రస్తుతం రీ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది.
Also Read : మహేష్ బాబు ఇండియాలోనే స్టార్ హీరోగా మారుతాడా..?
దీంతో మహేష్ బాబు స్టామినా ఏంటో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి అర్థమైందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన సినిమా రీ రిలీజ్ చేసిన ప్రతిసారి మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కాని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం అంతకుమించి వసూళ్లను రాబట్టింది.
తనదైన రీతిలో ఈ సినిమా తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే అతడు సినిమాని మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే అతిధి సినిమాని సైతం రీ రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అతిధి సినిమా ఫ్లాప్ అయినప్పటికి అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మహేష్ బాబు హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
కాబట్టి ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నారు. మొత్తానికైతే మహేష్ బాబు దూకుడుని ఆపేవారు ఎవరూ లేరనే రేంజ్ లో రిలీజ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
Also Read : మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ ఎవర్ గ్రీన్ పాత్ర ఏంటో తెలుసా..?