Venkatesh
Venkatesh : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. వాళ్ల ఇమేజ్ ను బేస్ చేసుకునే దర్శకులు కథలను రాస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో దర్శకులు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందా? లేదా అనే ధోరణిలో ఆలోచిస్తూ స్టోరీలను రెడీ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని సైతం మెప్పించే విధంగా ఉంటున్నాయి. రీసెంట్ గా ఆయన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటుగా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే 20 కథలను విన్న వెంకటేష్ అవి నచ్చల వాటిని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో 300 కోట్లకు పైన వసూళ్లను కొల్లగొట్టిన ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టాలి తప్ప, డిజాస్టర్లుగా మిగల్చకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.
Also Read : విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ న్యూస్… వర్క్ అవుట్ అయితే మరో బ్లాక్ బస్టర్!
దానికోసమే ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజాసాబ్ (Rajasaab) సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారుతున్న మారుతి(Maruthi) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు ‘బాబు బంగారం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి మారుతి మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. వెంకటేష్ స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక ఫ్యామిలీ సబ్జెక్టు కనక పడితే దానికి పాన్ ఇండియాలో మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఇద్దరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో దయ్యాల నేపధ్యం ఉన్న సినిమాని చేస్తున్న మారుతి వెంకటేష్ తో చేయబోయే సినిమాతో మాత్రం పూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నమైతే చేయబోతున్నాడట. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి ప్రభనజన్ని సృష్టిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేస్తారంటూ వార్తలైతే వస్తున్నాయి… ప్రస్తుతం రాజాసాబ్ సినిమా మీదనే తన దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించిన మారుతి ఎలాగైనా సరే ఆ సినిమాను సక్సెస్ చేసి చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : చిక్కుల్లో పడ్డ విక్టరీ వెంకటేష్..’సంక్రాంతికి వస్తున్నాం’ ఎఫెక్ట్..ఎటూ తేల్చుకోలేకపోతున్నాడుగా!