Mahesh Babu help : మహేష్ బాబు ఔదార్యం… ఇకపై విద్యార్థులకు కూడా సహాయం!

మహేష్ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా కోసం మహేష్ సిద్ధం కానున్నారు.

Written By: NARESH, Updated On : November 20, 2023 4:48 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu help : ఎన్ని కోట్ల సంపద, సంపాదన ఉన్నా… పేదలకు పెట్టే మనసు కూడా ఉండాలి. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ఒక అడుగు ముందే ఉంటాడు. పలువురి సహాయం చేస్తూ నిజజీవితంలో కూడా మహేష్ శ్రీమంతుడు అనిపించుకున్నాడు. 2015లో శ్రీమంతుడు చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ సినిమాలో మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాడు. ఈ సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు ఏపీ, తెలంగాణాలలో ఒక్కో గ్రామం చొప్పున రెండు గ్రామాలు దత్తత తీసుకున్నారు.

దత్తత తీసుకున్న గ్రామాలకు మౌళిక సదుపాయాలు కలగజేశాడు. చాలా కాలం క్రితమే మహేష్ బాబు తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఉచిత ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడానికి ఏళ్ళు పట్టింది. ఇప్పటి వరకు షుమారు 2500 మంది చిన్నారులు ఈ ఫౌండేషన్ ద్వారా చికిత్స పొందారని సమాచారం.

తాజాగా మహేష్ మరో మంచి పనికి పునాది వేశాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని… ఎడ్యుకేషన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కొందరు పేద విద్యార్థులకు కృష్ణ ఎడ్యుకేషన్ ఫండ్ నుండి స్కాలర్ షిప్స్ అందించనున్నారట. విద్యార్థులను కూడా చదివించాలి, వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో మహేష్ బాబుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా చకచకా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మహేష్ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా కోసం మహేష్ సిద్ధం కానున్నారు.