https://oktelugu.com/

Mahesh Babu Emotional Post: ఎప్పటికీ ప్రేమిస్తాను.. కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ !

Mahesh Babu Emotional Post: సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాదు, మహేష్ భావోద్వేగం కూడా ఎంతో అందంగా ఉంటుంది. తన తల్లి గారు అంటే.. మహేష్ కి ఎంతో అపురూపమైన ప్రేమ. కాగా నేడు మహేష్ అమ్మ గారు ‘ఇందిరాదేవి’ పుట్టినరోజు. మహేష్ తన తల్లికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశాడు. ‘అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఎప్పుడూ నీ ఆశీస్సులు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 07:25 PM IST
    Follow us on

    Mahesh Babu Emotional Post: సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాదు, మహేష్ భావోద్వేగం కూడా ఎంతో అందంగా ఉంటుంది. తన తల్లి గారు అంటే.. మహేష్ కి ఎంతో అపురూపమైన ప్రేమ. కాగా నేడు మహేష్ అమ్మ గారు ‘ఇందిరాదేవి’ పుట్టినరోజు. మహేష్ తన తల్లికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

    Mahesh Babu Emotional Post

    ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశాడు. ‘అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఎప్పుడూ నీ ఆశీస్సులు అందిస్తున్నందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నీ పై నా ప్రేమను వ్యక్తం చేయడానికి నిజంగా నాకు ఒక్క రోజు సరిపోదు. నిన్నెప్పటికీ నేను ప్రేమిస్తునే ఉంటాను’ అంటూ మహేష్ కన్నీళ్లతో మెసేజ్ చేసినట్టు ఒక ట్వీట్ పెట్టాడు.

    Also Read: Ram Gopal Varma Maa Ishtam Movie: హేయ్.. వివాదాస్పద వర్మ షాక్ ఇచ్చాడుగా !

    మహేష్ తన తల్లి పై ప్రేమను వ్యక్తపరుస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మపై మహేష్ కి ఉన్న ప్రేమను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తికి మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

    Mahesh Babu Emotional Post

    జీవితాన్ని ఇచ్చిన మహిళ పట్ల ఎంత ప్రేమను చూపించినా, అచ్చం తల్లిలా బిడ్డ ప్రేమించడం సాధ్యం అవుతుందా ? అయినా మహేష్ బాబు చెప్పినట్టు ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఒక రోజు సరిపోదు. అసలు మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ జీవిత కాలమే సరిపోదు. అంత గొప్పది తల్లిప్రేమ.

    ప్రసూతి బంధాల నుంచి మొదలుపెడితే.. సమాజంలో తల్లుల ప్రభావం వరకూ ప్రతి విషయంలో ప్రతి ప్రాణి ఆలోచనా విధానంలో తల్లి తాలూకు ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మహేష్ బాబు పై కూడా ఆయన తల్లి ‘ఇందిరాదేవి’ గారి ప్రభావం ఎంతో ఉంది.

     

    Also Read:Megastar Chiranjeevi: చిరంజీవి మెసేజ్ పై చంద్రబాబు ఫ్యాన్స్ సీరియస్ !

    Recommended Videos:

    Tags