Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Emotional Post: 'నువ్వు ఎప్పటికీ చిన్నారివే' అంటూ కూతురు సితారపై మహేష్ ఎమోషనల్...

Mahesh Babu Emotional Post: ‘నువ్వు ఎప్పటికీ చిన్నారివే’ అంటూ కూతురు సితారపై మహేష్ ఎమోషనల్ పోస్ట్..

Mahesh Babu Emotional Post: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక ఇంటర్వ్యూస్ లో ఆయన తన తండ్రి కృష్ణ గురించి చెప్తూ ‘మా నాన్న ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ, ఎంత బిజీ గా ఉన్నప్పటికీ, ఇంటికి రాగానే మా కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. మాతో కలిసి ఆడుకుంటారు, ఆయన్ని చూసిన తర్వాతనే నా పిల్లలతో కూడా ఇలా ఉండాలని నిర్ణయించుకున్నాను , అలాగే ఉంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ తన పిల్లలతో ఉంటున్న తీరుని చూస్తుంటే , ఆయన తన తండ్రి నుండి ఈ లక్షణాలను వారసత్వం గా ఎలా అలవాటు చేసుకున్నారో అర్థం అవుతోంది. ఆయన సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా, షూటింగ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత తన పిల్లలతో గడపడానికే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.

ముఖ్యంగా తన కూతురు సితార అంటే మహేష్ కి ఎంత ప్రేమ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ పుట్టినరోజు ని ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు మహేష్. అంతే కాకుండా, శుభాకాంక్షలు సోషల్ మీడియా లో తెలిపేటప్పుడు , ఆయన ప్రేమ ప్రతీ అక్షరం లోనూ కనిపిస్తూ ఉంటుంది. నేడు సితార పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఒక పోస్ట్ వేస్తూ ‘ఎంత ఎదిగినా , నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ చిన్నారివే. హ్యాపీ 14 సితార. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లవ్ యూ’ అంటూ ఆయన వేసిన ట్వీట్ చూస్తే , చాలా ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది. ఈ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ ఫొటోలో మహేష్ బాబు లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇది ‘వారణాసి’ లుక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ‘వారణాసి’ సినిమా విషయానికి వస్తే శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది అక్టోబర్ లోపు పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గానే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ మొదలు అవ్వడానికి ముందు రాజమౌళి నటీనటులందరితో రిహార్సల్స్ చేయించారు. ప్రతీ షెడ్యూల్ కి ముందు ఇలా రిహార్సల్స్ చేయించడం రాజమౌళి కి అలవాటే. పర్ఫెక్షన్ కోసం ఆయన ఇలా చేస్తుంటారు. ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని వచ్చే నెల 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version