Lenin 10 Days Collection: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , 10 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వస్తుందని ఊహించారు కానీ , కాస్త తగ్గిందనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ పది రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి , ఇప్పటి వరకు ఎంత లాభాలు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం ఇరగకుమ్మింది అనే అనుకోవాలి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం , నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి పది రోజుల్లో 12 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. 7 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 5 కోట్ల 30 లక్షల రూపాయిల లాభం ఈ ప్రాంతం నుండి ఇప్పటి వరకు వచ్చింది. అదే విధంగా సీడెడ్ నుండి 3 కోట్ల 51 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంత నుండి 3 కోట్ల 76 లక్షలు వచ్చాయి. సీడెడ్ ప్రాంతం లో మాత్రం ఈ చిత్రానికి ఆసించిన స్థాయిలో రన్ రావడం లేదనే చెప్పొచ్చు. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా అమరావతి రీజియన్ విషయానికి వస్తే కృష్ణా జిల్లా నుండి 1 కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, గుంటూరు నుండి 2 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా నెల్లూరు జిల్లా నుండి 1 కోటి 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 28 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుడి 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 34 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 63 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం అసాధ్యమే.
