https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : కవలలుగా మహేష్ బాబు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కథ ఓకే చేసాడు అంటే.. ఆ కథలో ఖచ్చితత్వమైన కంటెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మహేష్ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు గాని, ఆయన తీసుకున్న కథల విషయంలో మహేష్ ఎప్పుడూ తన విశ్వసనీయతను కోల్పోలేదు, అందుకే మహేష్ ప్లాప్ సినిమాలు కూడా టీవీల్లో సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఇక మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కథ ఏమిటి ? ఈ సినిమా ఏ […]

Written By:
  • admin
  • , Updated On : July 16, 2020 / 09:16 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు కథ ఓకే చేసాడు అంటే.. ఆ కథలో ఖచ్చితత్వమైన కంటెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మహేష్ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు గాని, ఆయన తీసుకున్న కథల విషయంలో మహేష్ ఎప్పుడూ తన విశ్వసనీయతను కోల్పోలేదు, అందుకే మహేష్ ప్లాప్ సినిమాలు కూడా టీవీల్లో సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఇక మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కథ ఏమిటి ? ఈ సినిమా ఏ అంశం పై ఉండనుందని టైటిల్ ను ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ అంశాల పై సినిమా సాగుతుందని.. అలాగే సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని ఆ మధ్య బాగా వినిపించింది.

    ఈషా రెబ్బ, కార్తికేయతో కలిసి చిరు గొప్ప సందేశం!

    అయితే తాజాగా సిని వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ ది డ్యూయల్ రోల్ అట.. మహేష్ కవలలుగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ కవలల్లో ఒకరు బ్యాంక్ అధికారి అట. సినిమా కూడా
    భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుందని.. తన అన్నని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మరో మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ సినిమా నడుస్తోందని.. సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

    ప్రభాస్ ఒక్కడే దిక్కు.. మరి ఒప్పిస్తాడా?

    అయితే మహేష్ పాత్రకు సంబంధించి రివీల్ చేసిన ఈ ఊహాగానాలు, డైరెక్టర్ పరుశురామ్ టీమ్ లోని ఓ మెంబర్ ద్వారా అందిన ఎక్స్ క్లూజివ్ సమాచారం. ఇక ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందట.. పైగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడు, అందుకే హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మారుస్తున్నాడు. ఇప్పటికే మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ ప్రెస్టీజియస్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాయి.