Mahesh Babu OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీ రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి. అభిమానులకు మాత్రమే కాదు, ఈ సినిమా నుండి వస్తున్న ప్రతీ అప్డేట్ మూవీ లవర్స్ లో కూడా ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈమధ్య కాలం లో ఒక తెలుగు సినిమా పై ఇంతటి భారీ అంచనాలు ఏర్పడడం ఎవ్వరూ చూడలేదు. గతం లో ‘దేవర’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలకు మాత్రమే ఇలాంటివి చూశారు. ఇకపోతే ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నటిస్తున్నాడని అన్నారు, ఆ తర్వాత అది అబద్దం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడని మరికొంతమంది అన్నారు. ఇప్పుడు ఈ రెండు కాకుండా మరో రూమర్ వైరల్ గా మారింది.
Also Read: ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ కి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్!
ఈ సినిమా క్లైమాక్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడని, ఆయనకు సంబంధించిన డేట్స్ ని కూడా రాజమౌళి అనుమతి తీసుకొని మూవీ టీం తీసుకుందని అంటున్నారు. సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని గత నాలుగు రోజుల నుండి ఒక ప్రచారం సాగుతుంది. ఆ నాలుగు రోజుల షూటింగ్ ఈ స్పెషల్ రోల్ కి సంబంధించినదే అట. ముందుగా షూటింగ్ చేస్తే లీక్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో, ఆ పార్ట్ వరకు షూటింగ్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సినిమా విడుదల దగ్గర్లో ఉన్నప్పుడు చేద్దామని అనుకున్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు ఇది ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ గా థియేటర్స్ లో ఉంచాలని కోరుకున్నారు. కానీ సోషల్ మీడియా యుగం లో ఒక విషయాన్ని దాచడం చాలా పెద్ద కష్టం, అందుకే ఈ వార్త లీక్ అయిపోయింది.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే మూవీ లవర్స్ కి పండగే అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారో లేదో తెలియదు కానీ, ఒకవేళ కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ కి లైఫ్ టైం జ్ఞాపకం గా మిగిలిపోతుంది. ఎవరు అవునన్నా, కాదన్నా, రాజమౌళి యుగం మొదలు కాకముందు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కింగ్స్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నే. ఇప్పటికీ కూడా కింగ్స్ వాళ్లిద్దరే. మిగతా హీరోలు లాగా పాన్ ఇండియన్ సినిమాలు చేయడం లేదు కానీ, ఒకవేళ చేస్తే మాత్రం మళ్ళీ వీళ్ళ స్థానాల్లో మనం చూడొచ్చు. మహేష్ బాబు రాజమౌళి సినిమాతో, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో జెండా పాతేస్తారని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.