Mahesh Babu-Deepika Padukone : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులకు ఎన్నో డ్రీం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి రాజమౌళి(SS Rajamouli) ప్రాజెక్ట్. రీసెంట్ గానే ఈ సినిమా మొదలై ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా మొదలు పెట్టుకోనుంది ఈ చిత్రం. ఇది కాకుండా మహేష్ ఫ్యాన్స్ కి మరో డ్రీం ప్రాజెక్ట్ ఉంది. అది తమ అభిమాన హీరో ని దీపికా పదుకొనే(Deepika Padukone) సరసన చూడాలి అని. మహేష్, రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటించబోతుంది అనే వార్త బయటకి వచ్చినప్పుడు, ఈమెకు బదులుగా దీపికా పదుకొనే ని తీసుకోవచ్చు కదా అని ఎంతో మంది మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి విలేజ్ లవ్ స్టోరీ ని ప్లాన్ చేశారట.
Also Read :టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.. కానీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు జంప్.. చివరకు…
కానీ అది మహేష్ ఇమేజ్ కి సరిపోయేట్టు లేదని మహేష్ రిజెక్ట్ చేసాడట. ఆ సినిమా మరేదో కాదు, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన్న ‘ఫిదా’. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషనల్ హిట్. ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఎలా బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుందో, ఈ సినిమా థియేటర్స్ లో ఉన్నన్ని రోజులు అలాంటి ఫీలింగ్ ని తీసుకొచ్చింది. సుమారుగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు తో ప్లాన్ చేయాలనీ అనుకున్నట్టు శేఖర్ కమ్ముల ఎన్నో ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. అంతే కాదు హీరోయిన్ గా దీపికా పదుకొనే ని తీసుకోవాలని అనుకున్నాడట. మహేష్ తో సినిమా అంటే ఆమె కూడా ఆసక్తి చూపించిందని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.
కానీ మహేష్ ఇది నా ఇమేజ్ కి వర్కౌట్ అవ్వదు అని చెప్పడం తో చివరికి వరుణ్ తేజ్ తో చేయాల్సి వచ్చింది. నిజంగా ఈ సినిమా మహేష్ బాబు చేసి ఉండుంటే కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండకపోవచ్చు. కానీ ఒక అందమైన క్లాసిక్ లవ్ స్టోరీ మా అభిమాన హీరో ఫిల్మోగ్రఫీ లో చేరింది అనే తృప్తి అభిమానులకు మిగిలి ఉండేది. అంతే కాకుండా దీపికా పదుకొనే తో తమ అభిమాన హీరోని చూసినందుకు ఎంతో సంతోషించేవారు ఫ్యాన్స్. అంతే కాకుండా ఇందులో హీరోయిన్ క్యారక్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి, కచ్చితంగా దీపికా పదుకొనే కి మన తెలుగు మార్కెట్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేది. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరి కలయిక ని వెండితెర పై చూస్తామా లేదా అనేది చూడాలి.
Also Read : మరో బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న నితిన్..ఇలా అయితే కష్టమే!