Chhaava Movie : బాలీవుడ్ ప్రేక్షకులు ఒక సినిమాని ఆదరిస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రికార్డ్స్ ని నెలకొల్పుతారని, లాంగ్ రన్ అయితే నెలల తరబడి ఇస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంటూ ఉంటారు. అందుకు లేటెస్ట్ ఉదాహరణగా ‘చావా'(Chhaava Movie) చిత్రం నిల్చింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక(Rashmika Mandanna) ఎంతో అద్భుతంగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు సునామీ లాగా మొదలైన వసూళ్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు వస్తూనే ఉన్నాయి. థియేటర్స్ లో విడుదలై రెండు నెలలు పూర్తి అయ్యినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక సినిమాని ఆడియన్స్ ఆదరిస్తున్నారంటే, ఏ రేంజ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
Also Read : మహేష్ బాబు, దీపికా పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా?
ఇకపోతే ఈ చిత్రం పదవ వారం లో ప్రతిష్టాత్మక 600 కోట్ల రూపాయిల క్లబ్ మార్క్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పదవ వీకెండ్ లో 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఒకపక్క జాట్, కేసరి 2 వంటి చిత్రాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఆడియన్స్ కి రెండు కొత్త ఛాయస్లు ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడో రెండు నెలల క్రితం విడుదలైన సినిమాని ఇప్పటికీ ఆద్రిస్తున్నారంటే సాధారణమైన విషయం కాదు. మొదటి వారం నుండి పదవ వారం వరకు ఈ సినిమాకు వారాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. మొదటి వారం ఈ చిత్రానికి 225 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాగా, రెండవ వారంలో 186 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా మూడవ వారం లో 85 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, నాల్గవ వారం లో 44 కోట్ల రూపాయిలు, 5 వ వారం లో 31 కోట్ల రూపాయిలు, ఆరవ వారం లో 16 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక 7వ వారం నుండి చిన్నగా వసూళ్లు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. 7వ వారం లో 7 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 8 వ వారం లో 3 కోట్ల 50 లక్షలు, 9 వ వారం లో 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా థియేట్రికల్ రన్ ఆగిపోలేదు. మరో రెండు కోట్ల నెట్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రానికి దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.