Tollywood Heroine : అయితే ఈమె టాలీవుడ్లో బాగా కొనసాగుతున్న సమయంలోనే టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. హిందీలో కూడా ఈ బ్యూటీ వరుస అవకాశాలను అందుకుంది. ఈ చిన్నది తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవడంతోపాటు తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కనిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి నార్త్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి చక్రం తిప్పుతుంది. చదువుల్లో ఈమె టాపర్. నటన పై తనకు ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది.
Also Read : జాన్వి కపూర్ పిన్ని ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.. ఎవరో చెప్పగలరా…
ముఖ్యంగా వ్యాసలిన్ యాడ్ ద్వారా ఈ చిన్నది బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషలలో కూడా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కానీ టాలీవుడ్లో కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఇన్నేళ్లు తెలుగు సినిమాలలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ చిన్నది ప్రస్తుతం హిందీలో గ్లామర్ లిమిట్స్ క్రాస్ చేసింది. తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ రెడ్ డ్రస్సులో ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల రాశిఖన్నా. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా తనదైన ముద్ర వేసింది.
నాగశౌర్య కు జోడిగా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కళల రాణిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. రాశిఖన్నా తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరి సరసన నటించిన. కానీ ఈమెకు అనుకున్నంత స్టార్ డం అయితే రాలేదు. ఇప్పుడు హిందీలో తన చక్రం తిప్పుతుంది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీలో తన సినీ కెరియర్ను స్టార్ట్ చేసింది. రీసెంట్గా సబర్మతి రిపోర్టు అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోండి. అంతకుముందు రాశిఖన్నా సిద్ధార్థ మల్హోత్రా సరసన యోధ అనే సినిమాలో కూడా నటించింది.
View this post on Instagram