Vijay Devarakonda Wedding Reception: నిన్న హైదరాబాద్ లోని బంజారా హిల్స్, తాజ్ బంజారా హోటల్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ, వ్యాపార వేత్తలు హాజరు అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్ , అల్లు అర్జున్ , నాని, నవీన్ పోలిశెట్టి , రానా దగ్గుబాటి శ్రీలీల , కృతి శెట్టి, మాస్ మహారాజ రవితేజ తదితరులు ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ఇక రాజకీయ నాయకుల్లో కేటీఆర్ , హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు హాజరయ్యారు.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించాడు కానీ, ఎందుకో ఆయన రాలేదు. ఇకపోతే మహేష్ బాబ్ కుటుంబం నుండి నమ్రత శిరోడ్కర్, సితార హాజరయ్యారు. ముఖ్యంగా సితార నిన్నటి వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అందం విషయం లో ఆమె ఏకంగా రష్మిక ని సైతం డామినేట్ చేసింది. నిన్న ఆమె రష్మిక తో సరదాగా మాట్లాడిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో వీళ్లిద్దరు మాట్లాడుకోవడాన్ని చూసిన ఫ్యాన్స్ , వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారో సబ్ టైటిల్స్ ఇస్తున్నారు సోషల్ మీడియా లో. ‘ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావ్.. పెళ్లి కూతురు నువ్వా ?’ అంటూ రష్మిక సితార తో ఫన్నీ సంభాషణ చేసిందని, అందుకు సితార సిగ్గు పడుతూ నవ్వింది సోషల్ మీడియా లో అభిమానులు జోక్స్ వేసుకుంటున్నారు.
నిజానికి నిన్న సితార అందరినీ డామినేట్ చేసే రేంజ్ లోనే ఉన్నింది. ఎంతో మంది హీరోయిన్స్ నిన్న వెడ్డింగ్ రిసెప్షన్ లో కనిపించారు. వాళ్లందరికంటే సితార నే అందంగా ఉన్నింది. తెలుపు రంగులో ఉండే ఆమె , ఎర్రని దుస్తుల్లో కనిపించడంతో ఏంజిల్ లాగా కనిపించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. అయితే మహేష్ బాబు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి రాకపోవడానికి కారణం ఆయన వారణాసి మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్లే. రీసెంట్ గానే జార్జియా లో ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైంది.