https://oktelugu.com/

Mahesh Babu: అనిల్ కపూర్ తో కలిసి మహేష్ బాబు డ్యాన్స్.. చూసి తీరాల్సిందే.. వైరల్ వీడియో…

నిన్న జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించడంతోపాటుగా పలువురు తెలుగు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్ కి హాజరై తమదైన రీతిలో ఈ సినిమాకి బెస్ట్ విషెస్ ని అందజేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 28, 2023 / 04:47 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: ప్రస్తుతం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలదే హవా… ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అనిమల్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందుతున్న సినిమాగా గుర్తింపును తెచ్చుకుంటుంది. ఒక్క ట్రైలర్ ఈ సినిమా టోటల్ ఇండియా వైడ్ గా తమదైన రీతిలో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుందనే పేరు అయితే సంపాదించుకుంది. ఇక అందులో భాగంగానే నిన్న జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించడంతోపాటుగా పలువురు తెలుగు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్ కి హాజరై తమదైన రీతిలో ఈ సినిమాకి బెస్ట్ విషెస్ ని అందజేశారు.

    ఇక అందులో ముఖ్యంగా రాజమౌళి మహేష్ బాబు లాంటి వరుసటైల్ డైరెక్టర్, హీరోలు ఈ సినిమా ఈవెంట్ కి హాజరవ్వడం గ్రేట్ అనే చెప్పాలి…
    ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు బాలీవుడ్ లో ఒక్కప్పటి స్టార్ హీరో అయిన అనిల్ కపూర్ ఈ సినిమా గురించి చాలా హైప్ వచ్చేలా మాట్లాడుతూ ఈ సినిమాను టాక్ ఆఫ్ ఆఫ్ ది టౌన్ గా మారాలా చేశారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ తనదైన రీతిలో స్టేజ్ పైన డాన్స్ చేస్తూ మహేష్ బాబు చేత కూడా డాన్స్ చేయించడం మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఆ దృశ్యాన్ని చూసి నిజంగా ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి.

    నిజానికి మహేష్ బాబు ఆయన సినిమాల్లో కూడా పెద్దగా డాన్స్ లు వేయడు, అయినప్పటికీ ఆయన స్టేజ్ మీద ఒకటి రెండు స్టెప్పులు వేసేసరికి అభిమానుల ఎక్కువ ఆనందానికి గురవుతున్నారు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పైన ప్రతి ప్రేక్షకులు కూడా తమదైన రీతిలో చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ సాధిస్తుంది అని పలువురు ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

    ఇక సందీప్ ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా బాలీవుడ్ హీరోలు సైతం తమతో ఒక సినిమా చేయమని తన వెనకాల పడే విధంగా తయారయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా సందీప్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది…