https://oktelugu.com/

ట్వీటర్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహేష్

సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం సూపర్ స్టార్ మహేష్ బాబుకి కొత్తేమీ కాదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి మహేష్ బాబు అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో మహేష్ బాబు మంచి విజయాలను దక్కించుకున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ సత్తాను చూపింది. తాజాగా మహేష్ బాబు ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ […]

Written By: , Updated On : March 7, 2020 / 12:26 PM IST
Follow us on

సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం సూపర్ స్టార్ మహేష్ బాబుకి కొత్తేమీ కాదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి మహేష్ బాబు అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో మహేష్ బాబు మంచి విజయాలను దక్కించుకున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ సత్తాను చూపింది. తాజాగా మహేష్ బాబు ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబుకి మహిళల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షూటింగ్ లతో బీజీగా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. ట్వీటర్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటాడు. ఇందులో సినిమా విషయాలతోపాటు పర్సనల్ విషయాలను పోస్టు చేస్తుండటంతో ఆయనకు రోజురోజు ట్వీటర్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

సోషల్‌ మీడియాలో మహేష్ బాబును ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉంది. మహేష్‌ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా తొమ్మిది మిలియన్లను క్రాస్ చేసింది. సౌత్‌ ఇండియాలో 9మిలియన్ల ట్విట్టర్‌ ఫాలోవర్లను కలిగిన ఏకైక నటుడిగా మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్దనే కాకుండా సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు దూకుడు చూపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ బాబు దూకుడు చూస్తుంటే త్వరలోనే 10మిలియన్ ఫాలోవర్స్ ను దాటేయడం ఖాయంగా కన్పిస్తుంది.