Mahesh Babu: మహేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ ప్రాంతం లో మేజర్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడవి శేష్ హీరో గా తెరకెక్కించిన మేజర్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదల కి ముందు నుండే టీజర్స్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని […]

Written By: Neelambaram, Updated On : June 8, 2022 1:24 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడవి శేష్ హీరో గా తెరకెక్కించిన మేజర్ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదల కి ముందు నుండే టీజర్స్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అంటే పెట్టిన పైసలు మొదటి రోజే సగానికి పైగా వచ్చేసాయి అన్నమాట..అలా మొదటి రోజే ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి రెండవ రోజు తో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ స్టేటస్ ని అందుకుంది..ఇక మూడవ రోజు నుండి ఈ సినిమా ని కొన్న ప్రతి ఒక్క బయ్యర్ కి లాభాలే..తెలుగు వెర్షన్ లో ఈ స్థాయి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమాకి మిగిలిన భాషల్లో కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం గమనార్హం.

Mahesh

ముఖ్యంగా ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము లేపేస్తాయి..పైగా ఇది దేశ భక్తికి సంబంధించిన సినిమా..అందులోనూ ముంబై లో జరిగిన ఒక్క యదార్ధ సంఘటనని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా..అలాంటి సినిమా కి హిందీ లో కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Also Read: Chiranjeevi: షాకింగ్.. షూటింగ్ లో ఉన్న రెండు సినిమాలను ఆపేసిన చిరంజీవి

దానికి కారణం కూడా లేకపోలేదు అని కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు..అసలు విషయానికి వస్తే మేజర్ సినిమా హిందీ ప్రొమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చురుగ్గా పాల్గొన్నారు..ఒక్క రోజు ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో మహేష్ బాబు ని ఒక్క విలేఖరి ప్రశ్న అడుగుతూ ‘సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు..పాన్ ఇండియా సినిమాలు వరుసగా చేస్తున్నారు..కానీ మీరెందుకు ఇప్పటి వరుకు హిందీ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు..? రీసెంట్ గా విడుదల అయినా మీ సర్కారు వారి పాట సినిమాని కూడా హిందీ లో విడుదల చెయ్యలేదు..దానికి కారణం ఏంటి..?’ అని అడిగారు.

Mahesh Babu

దీనికి మహేష్ బాబు సమాధానం చెప్తూ ‘ బాలీవుడ్ లో సినిమాలు చెయ్యాలని నాకు కూడా ఉంది..కానీ ఇక్కడి నిర్మాతలు నన్ను భరించలేరు..నేను అడిగినంత డబ్బులు ఇచ్చే స్థానం లో వాళ్ళు లేరు..అందుకే నేను ఇప్పటి వరుకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకోవాలి వచ్చింది’ అంటూ మహేష్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి..బాలీవుడ్ మీద ఇంత చులకన భావం మహేష్ బాబు కి ఉంది అని మేము అనుకోలేదు అని..అతని సినిమా మేజర్ ని బాలీవుడ్ లో బాయ్ కాట్ చెయ్యాలి అంటూ నెటిజెన్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో రచ్చ చేసారు..దాని ప్రభావం ఈ సినిమా మీద గట్టిగా పడింది అని..అందుకే మేజర్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కాశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో బాలీవుడ్ ని ఊపేస్తోంది అని అనుకున్న ఈ సినిమా ఇలా చతికిలపడడం నిజంగా మహేష్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి..మహేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రభావం ఈ ఒక్క సినిమా తోనే పరిమితం అవుతుందా..? లేదా త్వరలో ఆయన చెయ్యబోతున్న రాజమౌళి సినిమా మీద ఆ ప్రభావం పడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read:NTR- Prashant Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి నారా రోహిత్ ఫ్లాప్ సినిమా టైటిల్

Recommended Videos:

Tags