HHVM Movie censor update:మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) చిత్రం మన ముందు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాకు సెన్సార్(Censor Reports) సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేశారు. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాల 60 సెకండ్స్ ఉందట. పెద్దగా కట్స్ కూడా లేకుండా ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే సందేహం వారిలో ఉండేది.
Also Read: బాలయ్య చేయాల్సిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఆ సందేహాలకు ఎట్టకేలకు చెక్ పడినట్టే. ఆ సందేహాలు అభిమానుల్లో కలగడానికి ముఖ్య కారణం జూన్ 12 న సినిమా విడుదల అన్నప్పుడు జూన్ 2 సెన్సార్ చేయించడానికి మూవీ టీం షెడ్యూల్ చేసుకుంది. కానీ అదే రోజు సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో అభిమానులకు గుండెలు ఆగినంత పని అయ్యింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి. అయితే సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈమధ్య కాలం లో ఇలాంటి గ్రాండియర్ చిత్రాన్ని చూడలేదని, ప్రతీ సన్నివేశం చూసేందుకు చాలా రిచ్ గా ఉందని, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ ఉన్నాయని, పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఫస్ట్ హాఫ్ కి భుక్తాయాసం వచ్చేస్తుందని చెప్పారట. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు న భూతొ న భవిష్యతి అనే రేంజ్ లో ఉందని అంటున్నారట.
Also Read: హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని మార్పులు..ముఖ్య అతిధులు ఎవరంటే!
ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం(మచిలీపట్టణం పోర్ట్), కోహినూర్ డైమండ్ ని దొంగిలించే సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, చార్మినార్ ఫైట్ సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే పోరాట సన్నివేశం, క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం హైలైట్స్ గా నిలిచాయని అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత అభిమానుల ఉత్సాహం చూసి థియేటర్స్ యాజమాన్యాలు భయపడే అవకాశాలు ఉంటాయి,కాబట్టి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే రేంజ్ లో సెన్సార్ సభ్యుల నుండి టాక్ వచ్చిందట. సినిమా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం కి హద్దులు అనేవే ఉండదు అనుకోవచ్చు.