Mahesh Babu Cheated Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కృష్ణ…ఇక తను చాప సక్సెస్ లను అందుకొని నెంబర్ వన్ పొజిషన్ ను కూడా దక్కించుకున్నాడు. కృష్ణ తర్వాత ఆయన కొడుకు అయిన మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేశాడు…ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మొత్తానికైతే మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తన మార్కెట్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… తక్కువ సమయంలోనే తండ్రి కి తగ్గ తనయుడిగా ఎదిగిన మహేష్ బాబు మంచి సినిమాలను చేయడం లో తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు.ఘట్టమనేని ఫ్యామిలీ ఎప్పుడు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న దాఖలాలైతే లేవు. అలాంటి మహేష్ బాబు చాప సంవత్సరాల పాటు కృష్ణ మాట జవదాటకుండా చాలా అతనికి గౌరవాన్ని కాపాడుతూ వచ్చాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం మహేష్ బాబు చేసిన ఒక పనికి కృష్ణ డిప్రెషన్ కి వెళ్ళిపోయాడట. చాలా విజయాల్లో కృష్ణ నిర్ణయాలను తీసుకున్నప్ప మహేష్ ఒక పెళ్లి విషయంలో మాత్రం తన తండ్రి ప్రమేయం లేకుండా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కృష్ణ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.. కృష్ణ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురిని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూశాడట. కానీ అప్పటికే వంశీ సినిమాలో మహేష్ బాబు తో కలిసి నటించిన నమ్రత శిరోద్కర్ ను లవ్ చేశాడు. తను కూడా మహేష్ ను ప్రేమించింది.
వీళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్న తర్వాత మహేష్ తన తండ్రి అయిన కృష్ణ కి ఈ విషయం చెబితే ఆయన నమ్రతతో పెళ్లి వద్దని చెప్పాడట. దాంతో మహేష్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇక వేరే గత్యంతరం లేక కృష్ణ వాళ్ళ పెళ్లి ని అంగీకరించి ఇంటికి తీసుకువచ్చి చాలా గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించాడు.
మహేష్ బాబు తన కెరియర్ లో ప్రతి విషయంలో కృష్ణ సలహాలు తీసుకున్నప్పటికి పెళ్లి విషయంలో మాత్రం కృష్ణ ను మోసం చేశాడంటూ పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా అటు కృష్ణ, ఇటు మహేష్ బాబు ఇద్దరు ఘట్టమనేని ఫ్యామిలి ని ముందుకు తీసుకెళ్లినవారే కావడం విశేషం…
ఇక ఇప్పుడు కృష్ణ మనమధ్య లేకపోయిన కూడా మహేష్ బాబుకి కృష్ణ అంటే చాలా ఇష్టం…అందుకే అప్పుడప్పుడు తనను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు. మొత్తానికైతే మహేష్ బాబు స్టార్ హీరో అవ్వాలని కృష్ణ ఎన్నో కలలు కన్నాడు. దానికి తగ్గట్టుగానే మహేష్ సైతం స్టార్ హీరోగా ఎదిగి కృష్ణ కోరికను నెరవేర్చాడు. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాతో కూడా పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…