Allu Arjun And Atlee: ఇప్పటివరకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ఆర్య సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. పాన్ ఇండియాలో ఆయనను మించిన నటుడు ఇంకెబ్బరు లేరనేంతలా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు… ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపధ్యలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా మీద అల్లు అర్జున్ మంచి అంచనాలతో ఉన్నాడు. ఆయన ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం… ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కావడం విశేషం…
ఇక ఇంతకు ముందు కమర్షియల్ సినిమాలను చేసిన ఆయన భారీ గ్రాఫిక్స్ ని వాడి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథేంటంటే హీరో ఒక రోబోను తయారుచేస్తాడట… దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల మనకు టైం సేవ్ ఎలా అవుతోంది. అనే విషయాల మీద ఈ సినిమా కథ ఉండబోతోందట…
ఇక ఇదంతా తెలుసుకున్న అభిమానులు ఈ స్టోరీ ఒకప్పుడు శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో కథను పోలి ఉందని అభిమానులు కొంతవరకు ఆవేదన ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ రెండు క్యారెక్టర్లలో ఉన్న వేరియేషన్స్ తను ఎలా చూపిస్తాడు దానికోసం స్పెషల్ గా ఏమైనా కసరత్తులు చేస్తున్నాడా? అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.
మొత్తానికైతే అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఈ సినిమాతో ఎన్ని కలెక్షన్స్ ను కొల్లగొడుతాడు. తద్వారా ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని నమోదు చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…