spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu career risk film: మహేష్ బాబు కెరియర్ ను ఫణంగా పెట్టి కృష్ణ...

Mahesh Babu career risk film: మహేష్ బాబు కెరియర్ ను ఫణంగా పెట్టి కృష్ణ సినిమా చేశాడా..?

Mahesh Babu career risk film: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లోనే డిఫరెంట్ సినిమాలను చేశాడు… ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టడానికి చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ సైతం ఒకానొక సమయంలో మహేష్ బాబు కెరీర్ ను పణంగా పెట్టి ఒక సినిమా చేశారట…కృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్ గా వచ్చిన ‘కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో నటించాడు…అయితే ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ లో మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేశాడు. బైక్ మీద చేసిన కొన్ని షాట్స్ లో తనే రియల్ గా నటించాడు… నిజానికి కృష్ణకి తెలియకుండానే మహేష్ బాబు ఆ స్టంట్స్ చేశాడట. ఫైనల్ గా కృష్ణ తెలుసుకొని ఇంకోసారి రియల్ స్టంట్స్ చేయకూడదు అంటూ మహేష్ బాబు కైతే వార్నింగ్ ఇచ్చాడట. మహేష్ బాబు ఆ సినిమాలో నటించడం వల్లే అలాంటి రియల్ స్టంట్స్ చేయాలనే కుతూహలం కలిగిందని ఒక రకంగా మహేష్ బాబు కెరీర్ ని పణంగా పెట్టి కృష్ణ ఆ సినిమాని చేశాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు.

మహేష్ బాబు కి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యులు అంటూ చాలామంది కృష్ణ మీద ఫైర్ అయ్యారు. కృష్ణ సైతం మహేష్ ను ఆ సినిమాలోకి తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ తీసుకున్న కూడా కృష్ణ అండర్ లోనే మహేష్ సన్నివేశాలు చిత్రీకరిస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు.

Also Read: బాలయ్య సినిమాలో రజనీకాంత్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడా..?

కానీ కృష్ణకు తెలియకుండా మహేష్ బాబు బైక్ స్టంట్స్ చేశాడు అంటే అది మహేష్ బాబు ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన స్టంట్స్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు… మహేష్ ను సినిమాల్లోకి తీసుకు వచ్చే టైమ్ లో ఆయనకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఉందని తెలిసినప్పుడు అతన్ని ముందుగానే మందలించి సినిమాల్లోకి తీసుకురావాలి అంతే కానీ మహేష్ బాబు ను తప్పు పట్టే ఆస్కారం లేదు. ఎందుకంటే తనకి ఉన్న ఏజ్ కి బైక్స్ అన్న స్టంట్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.

దానివల్ల ఆయన ఆ స్టంట్స్ చేయడానికి ఆసక్తి చూపించేవాడు. కానీ కృష్ణ దగ్గరుండి సినిమా ఇండస్ట్రీలో హీరో అనేవాడు రిస్కీ స్టంట్స్ కేవలం డూప్ తోనే చేయించుకోవాలి. ఎందుకంటే హీరోలకు ఏదైనా జరగరానిది జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాలను క్లియర్ కట్ గా చెబితే మహేష్ అలాంటి బైక్ స్టంట్స్ ట్రై చేసి ఉండేవాడు కాదేమో అంటూ అప్పట్లో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular