Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈయన ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో అలిసిపోవడం వల్ల అతనికి వెకేషన్ కి వెళ్లడానికి రాజమౌళి పర్మిషన్ అయితే ఇచ్చాడు. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బయట దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని ముందుగా రాజమౌళి కండిషన్ పెట్టినప్పటికి మహేష్ బాబు మాత్రం ప్రతి షెడ్యూల్ తర్వాత ఒక వెకేషన్ కి వెళ్లే అలవాటు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ అలవాటును ఈ సినిమా విషయంలో కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తన మైండ్ ని పీస్ ఫుల్ గా ఉంచుకోవడానికి విదేశాలకు వెళ్ళాడు. మరి ఆయన విదేశాలకు వెళ్లడం వల్ల సినిమా షూటింగ్ ని కొంతవరకు ఆపాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందట.
Also Read : ఎంత ప్రయత్నం చేసిన మహేష్ బాబు తో సినిమా చేయలేకపోయినా స్టార్ డైరెక్టర్…
దానివల్ల ప్రొడ్యూసర్ కి కొంత వరకు నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో రాజమౌళి ఎటు తేల్చుకోలేకపోతున్నాడని కూడా కొన్ని అభిప్రాయాలైతే వెల్లడవుతున్నాయి. మరి రాజమౌళితో సినిమాలు చేసే హీరోలు తన మాట వినాలని కోరుకుంటూ ఉంటాడు.
మరి మహేష్ బాబు మాత్రం మొదటిసారి రాజమౌళి రూల్స్ ను బ్రేక్ చేస్తూ విదేశాలకు వెళ్లడం పట్ల ఆయన కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో రాజమౌళి ఎలా స్పందిస్తాడు మహేష్ బాబు తన మాటను ధిక్కరించాడనే ఉద్దేశ్యంతో సినిమా మీద అంత పెద్దగా ఫోకస్ చేస్తాడా లేదా అనే ధోరణిలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కానీ మరి కొంతమంది చెబుతున్న సమాధానాన్ని బట్టి చూస్తే రాజమౌళికి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి ఎవరు ఏం చేసిన, చేయకపోయిన ఆయన పని మాత్రం ఆయన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే రాజమౌళికి పాన్ ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని మరి కొంతమంది కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు…
Also Read : మహేష్ మూవీపై రాజమౌళి పెద్ద ప్లానింగే