Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. పాన్ ఇండియాలో వాళ్ళు అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోయే సినిమాల్లో కూడా వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తద్వారా పాన్ వరల్డ్ సినిమా ప్రేక్షకులకు కూడా దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి సైతం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రయోగం భారీ సక్సెస్ ని సాధించి తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం పాన్ వరల్డ్ రేంజ్ కు చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…
Also Read : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఆ ఒక్కటి తగ్గుతుందా..?
ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఒకానొక సందర్భంలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వివి వినాయక్ (Vinayak) సైతం మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ ఎన్నిసార్లు అనుకొని మంచి కథలను మహేష్ బాబు వినిపించినప్పటికి వీళ్ళ కాంబో అయితే సెట్స్ మీదకి రాలేదు. ఒకప్పుడు వినాయక్ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. మహేష్ బాబు సైతం వినాయక్ తో సినిమా చేయాలని అనుకున్నప్పటికి అవి కార్యరూపం అయితే దాల్చలేదు…ఇక ప్రస్తుతం వినాయక్ తన పూర్తి ఫామ్ ను కోల్పోయి సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.
ఇక రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రవితేజను హీరోగా పెట్టి ఒక భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాలనే ఉద్దేశ్యంతో తను ఒక మంచి కథను రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వినాయక్ మరోసారి తన సత్తాను చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న సినిమాలో నటించనున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…