Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు కొన్న మహేష్ బాబు... ఎన్ని కోట్ల రూపాయలంటే

Mahesh Babu: జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు కొన్న మహేష్ బాబు… ఎన్ని కోట్ల రూపాయలంటే

Mahesh Babu: టాలీవుడ్ హీరోలంతా ఎక్కువగా తమ సంపాదనను స్థిరాస్థుల మీదే ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నగర శివార్లలో స్థలాలు కొన్నారు. ఇంకొంతమంది ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. నగర శివార్లలో అనేక మంది సెలెబ్రిటీలకు స్థలాలు ఉన్నాయి. ఒక్క సినిమాకు కోట్లలో పారితోషికాలు తీసుకునే నటులు, సంపాదనకు తగ్గట్టే ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లో ఓ ఇల్లు కొన్నారు. ఇప్పుడు అదే ఏరియాలో మహేష్ బాబు కూడా ఓ ప్లాటు కొన్నట్టు రియల్ ఎస్టేట్ వివరాలను అందించే ఓ వెబ్ సైట్ ప్రచురించింది.

mahesh babu buy a new house worth of 26 crores in jubilee hills area

ఆ వెబ్ సైట్ చెప్పిన వివరాల ప్రకారం…. మహేష్ బాబు కొన్న ఇల్లు ఖరీదు రూ.26 కోట్లు. దాదాపు 1442 గజాల్లో ఈ ప్లాటు ఉంది. దీన్ని ఆయన విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కొన్నారు. స్టాంప్ డ్యూటీ కింద కోటి నలభై మూడు లక్షల రూపాయలు చెల్లించారు. అలాగే ట్రాన్ఫర్ డ్యూటీ కింద మరో రూ.39 లక్షలు చెల్లించినట్టు వెబ్ సైట్ ప్రచురించింది. జూబ్లీహిల్స్ లో గజం భూమి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల దాకా ధర పలుకుతోంది. మహేష్ బాబు ప్లాటు నవంబర్ 17న రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular