Mahesh Babu and Balayya Babu : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాలు మాత్రమే ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ల సినిమాలను థియేటర్లో చూడడానికి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే దర్శకులు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ ను పెట్టి మంచి సినిమాను తీసి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు…
సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. రాజమౌళి(Rajamouli) రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) లను పెట్టి తీసిన త్రిబుల్ ఆర్ (RRR) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పటినుంచి ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ మంచి కథలను రాసుకుంటున్నారు. ఇక వీటికి స్టార్ హీరోలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఒకప్పుడు బాలయ్య బాబు (Balayya Babu) స్టార్ హీరోగా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరో రేంజ్ ను టచ్ అయితే చేశాడు.
మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని దర్శకుడు పూరి జగన్నాధ్ తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. వీళ్ళ ఇమేజ్ కి సరిపడా కథను కూడా రెడీ చేసిన పూరి జగన్నాధ్ ఇద్దరు హీరోలను మెప్పించడంలో మాత్రం కొంతవరకు తడబడ్డాడని అందువల్లే ఆ సినిమా పట్టాలెక్కలేదని చాలామంది సినిమా మేధావులు సైతం చెబుతూ ఉంటారు… నిజానికి మహేష్ బాబు లాంటి హీరోను స్టార్ హీరో చేసిన దర్శకుడు కూడా పూరి జగన్నాధే కావడం విశేషం…
పోకిరి(pokiri, బిజినెస్ మేన్ (Bussines men) లాంటి సినిమాలతో మహేష్ బాబుని స్టార్ హీరో గా మార్చి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టాడు. ఇక బాలయ్య బాబుతో పైసా వసూల్(Paisa Vasool) అనే సినిమాని కూడా చేసి మంచి విజయాన్ని అందుకున్న పూరి జగన్నాధ్ వీళ్లిద్దరితో మల్టీస్టారర్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని అనుకున్నప్పటికి అది కార్యరూపమైతే దాల్చలేదు…
ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరి ప్రాజెక్టులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 (Akhanda 2)సినిమా చేస్తూ చాలా బిజీగా గడుపుతుంటే మహేష్ బాబు మాత్రం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక మీదటైన వీళ్ళిద్దరూ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా ఎవరైనా దర్శకుడు మంచి కథను రెడీ చేసి వాళ్లను మెప్పించి సినిమా చేసే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…