Prabhas
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు… ఇక ఇండస్ట్రీలో ఏ హీరో ఎలాంటి స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికి ‘రెబల్ స్టార్ ప్రభాస్’ (Prabhas) మాత్రం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు… బాహుబలి )(Bahubali) సినిమాతో ఆయన సాధించిన విజయం ఒకెత్తు అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతున్నాయి అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన హను రాఘవపూడి(Hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) అనే సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ అయితే జరగబోతున్నట్టుగా సందీప్ క్లారిటీ అయితే ఇచ్చాడు… ఇక ప్రభాస్ తన కెరియర్ మొదట్లో త్రిష తో మూడు సినిమాలు చేశాడు. ఇక ఆ మూడు సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించడమే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక అదే సమయంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి.కానీ అదంతా ఫేక్ అని తేలిపోయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మాత్రం అప్పుడే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న అయిపోయేది. అలా అయితే ప్రభాస్ అప్పుడే ఒక ఇంటివాడు అయ్యేవాడు.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రభాస్ సమకాలీన హీరో అయిన మహేష్ బాబు (Mahesh Babu),పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ల కొడుకులు ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ప్రభాస్ మాత్రం 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నప్పటికి ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆ తర్వాత ఇండస్ట్రీకి వారసుడిగా ఎవరు వస్తారు.. తమ స్టార్ట్ డమ్ ను ఎవరు నిలబెడతారు అని ధోరణిలోనే అభిమానుల సైతం కొద్దిపాటి నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణంరాజు(Krishnam Raju)తర్వాత రెబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ హీరో పొజిషన్ ని కూడా కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సందర్భంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా ఎవరు రాబోతున్నారు అనే ప్రశ్నకి సమాధానం అయితే దొరకడం లేదు…