https://oktelugu.com/

Major Movie: ‘మేజర్’ కోసం కొత్త డేట్.. ప్రకటించిన సూపర్ స్టార్ !

Major Movie: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ‘గూఢచారి’ ఫేమ్ శశి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 27, 2022 / 01:11 PM IST
    Follow us on

    Major Movie: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది.

    Major Movie

    కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జూన్ 3వ తేదీన విడుదల చేస్తున్నట్టు మహేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    Also Read: Anchor Manjusha: యాంకర్ మంజూషా అందాల విందు

    ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

    Major Movie

    జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంతైనా అడివి శేష్ అందగాడు. అందుకే అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయట.

    అయితే ‘అడివి శేష్’ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని అడివి శేష్ స్వయంగా చెప్పి, తన ఫిమేల్ ఫాలోవర్స్ ను నిరాశ పరిచాడు. మరి ఈ హ్యాండ్సమ్ హీరోని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంకా శేష్ ఏ విషయం చెప్పలేదు.

    Also Read:Mahesh Babu: మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..?

    Tags