Koratala Siva: ఆచార్య ట్రైలర్ ని చూసి మన అందరం మోసపోయినట్టే

Koratala Siva:  మరో రెండు రోజుల్లో మెగా అభిమానులు మూడేళ్ళ నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..తొలిసారి తండ్రీకొడుకులు ఒక్కే సినిమాలో కలిసి నటిస్తుండడం తో ఈ మూవీ పై మెగా అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా […]

Written By: Neelambaram, Updated On : April 27, 2022 1:23 pm
Follow us on

Koratala Siva:  మరో రెండు రోజుల్లో మెగా అభిమానులు మూడేళ్ళ నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..తొలిసారి తండ్రీకొడుకులు ఒక్కే సినిమాలో కలిసి నటిస్తుండడం తో ఈ మూవీ పై మెగా అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం అయిపోయాయి..క్రేజీ కాంబినేషన్ కావడం తో ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది..ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో చిరంజీవి , రామ్ చరణ్ లతో పాటు డైరెక్టర్ కొరటాల శివ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

Koratala Siva

ఇక ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వూస్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఈ ఇంటర్వూస్ లో ఆచార్య గురించి ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అభిమానుల్లో నూతనోత్సహం ని నింపుతున్నాయి..ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్ ని చూసి ప్రేక్షకులు మరియు అభిమానులు రొటీన్ గానే ఉందే, కొత్తగా ఏమి అనిపియ్యలేదు అనే టాక్ సోషల్ మీడియా లో బాగా విస్తరించింది.

Also Read: Major Movie: ‘మేజర్’ కోసం కొత్త డేట్.. ప్రకటించిన సూపర్ స్టార్ !

ఇదే విషయం ని కొరటాల శివ ని ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా..ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ట్రైలర్ ని చూసి సినిమా అలాగే ఉంటుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..సినిమా అసలు దేవాలయాలను కాపాడే కాన్సెప్ట్ మీద అసలు తెరకెక్కించలేదు..ధర్మం గురించి ఇద్దరు మనుషులు పోరాడే దాని గురించే ఈ సినిమా ఉంటుంది..ఒక్క గురుకులం లో పెరిగిన అబ్బాయి నక్సలైట్ గా ఎదిగి ధర్మం కోసం పోరాడడానికి ఎలాంటి ప్రయాణం చేసాడు..అలాగే ఒక్క నక్సలైట్ గా ఉన్న వ్యక్తి ధర్మస్థలి కి వచ్చి ధర్మం వైపు పోరాడే ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేదే నేను ఈ సినిమాలో చూపించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

koratala siva

ఏప్రిల్ 29 వ తారీఖున విడుదల అవుతున్న ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో టికెట్ హైక్స్ కూడా ఇచ్చేసారు..ఇక టాక్ రావడమే ఆలస్యం, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగుతుంది అని మెగా అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు..వారి నమ్మకాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్స్ కూడా అదిరిపోయాయి..సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చింది అంటూ సెన్సార్ సభ్యులు మూవీ టీం ని పొగడ్తలతో ముంచి ఎత్తారు అట..చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునే స్థాయి కొరటాల శివ ఈ సినిమాని తీర్చి దిద్దాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరి ఈ సినిమా అదే స్థాయి ఉంటుందో లేదో తెలియాలి అంటే మరో రెండు ఆగాల్సిందే.

Also Read:KCR :  ఫ్లాష్… ఫ్లాష్.. కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Tags