Homeజాతీయ వార్తలుKCR :  ఫ్లాష్... ఫ్లాష్.. కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR :  ఫ్లాష్… ఫ్లాష్.. కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఆ పార్టీ అధ్యక్షుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని.. ప్రత్యామ్మాయ ఎజెండా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చినట్టైంది. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. గతంలో అనే రాజకీయ ఫ్రంట్లు వచ్చాయని.. అవి ఏం సాధించాని ప్రశ్నించారు. రాజకీయ పునరేకీకరణతో సాధించబోయేది ఏదీ లేదని అన్నారు.

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే ప్రత్యామ్మాయ సిద్ధాంతానికి ప్రారంభం పడాలని.. దానికి హైదరాబాద్ వేదిక కావాలని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా దేశ స్థితిని, గతిని మార్చేలా కొత్త ఎజెండా రూపొందితే అది మనకే గర్వకారణమన్నారు. ఉన్నపాటున ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకొని దేశ లక్ష్యం ఏంటో చెప్పుకునే పరిస్థితి లేదని అన్నారు. దేశ లక్ష్యం ఉంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతమో.. ఓ పార్టీ ప్రవరించే నాలుగు మాటలు కాదని అన్నారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందన్నారు.

దేశ ప్రజల సామూహిక లక్ష్యమే దేశ లక్ష్యం అయి ఉండాలని అన్నారు. ఒక గమ్యం దిశగా దేశం మొత్తం ప్రయాణం చేయాలని.. అలా అన్ని దేశాలు అభివృద్ధి దిశగా వెళుతుంటే భారతదేశం మాత్రం తన గమ్యాన్ని మర్చిపోయిందన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తూ మౌనంగా ఉండిపోదామా? అని ప్రశ్నించారు.

1980 వరకూ భారత జీడీపీ కన్నా చైనా జీడీపీ తక్కువ అని.. ఇప్పుడు ప్రపంచంలోనే సూపర్ పవర్ గా అవతరించిందన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకోవడం లేదని అన్నారు. మన రాష్ట్రంలో ఉండే ఓ జిల్లా అంత లేని ఇజ్రాయెల్ దేశం నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేసే స్థితిలో ఉన్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అద్భుతమైన అటవీ, ఖనిజ, జల సంపద ఉన్నప్పటికీ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.

దీన్ని కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ లో ఉన్నారని.. సమయం, సందర్భం వస్తే పార్టీని ప్రకటించి ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలతో కేసీఆర్ సంకేతాలు పంపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version