Homeఎంటర్టైన్మెంట్'మహేష్ - త్రివిక్రమ్' సినిమా కథ ఇదే !

‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా కథ ఇదే !

Mahesh Babu and Trivikram‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ బాగా వైరల్ అవుతుంది. సహజంగా త్రివిక్రమ్ సినిమాల కథలన్నీ ఓ ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. ఇప్పుడు మహేష్ తో చేస్తోన్న సినిమా కూడా అలాంటి కథేనట. కాకపోతే ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల చుట్టూ కథ నడుస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నారైగా కనిపించబోతున్నాడని, పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని మహేష్, మొదటిసారి ఇండియాకి తన పూర్వీకుల డిటైల్స్ కోసం రావాల్సి వస్తోందని.. తనకు ఏ మాత్రం అవగాహన లేని కోటలోకి అడుగు పెట్టాల్సి వస్తోందని, ఆ కోటకి ఆ ప్రాంతాలోని రాజకీయాలకు కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది.

మొత్తానికి త్రివిక్రమ్ కోటతో పాటు రాజకీయాల చుట్టూ కూడా కథను రాసుకున్నాడట. ఇక ఈ సినిమాలో మహేష్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాశాడని, ఆ పాత్రలో అనిల్ కపూర్ నటించే అవకాశం ఉందట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా జులై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

హారికా హాసిని క్రియేషన్స్ నిర్మణంలో రానున్న ఈ సినిమా 2022లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఈ సినిమా ‘పాన్ ఇండియా మూవీ’గా రాబోతుంది. పైగా మహేష్ నుండి రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఎలాగూ త్రివిక్రమ్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి.. మార్కెట్ కూడా బాగానే అయ్యే స్కోప్ ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular