
టీఎస్ ఈ సెట్ 2021 దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. అయితే దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసం లేకుండా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈసెట్ కన్వీనర్ సీహెచ్ వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వెసులబాటును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. ఈసెట్ పరీక్షలను జూలై 1వ తేదీన నిర్వహించనున్నారు.