https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: పవిత్రతో నరేష్ సహజీవనం… మహేష్ ఏం చేశారో తెలుసా?

నాలుగేళ్లకు పైగా పవిత్రతో నరేష్ సహజీవనం చేస్తున్నాడు. నరేష్-పవిత్రల బంధాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారనే ఒక సందేహం ఉంది. దీనిపై నరేష్ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 21, 2023 / 09:52 AM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: నటుడు నరేష్ కూడా ఫ్యామిలీ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుడే. కృష్ణ సొంత కొడుకు కాకపోయినా విజయనిర్మల బిడ్డగా ఆయన వద్దే పెరిగాడు. కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవితో తక్కువ ఉండేవారు. విజయనిర్మల-కృష్ణ మరణించేవరకు ఒకరినొకరు వీడలేదు. దీంతో నరేష్ వద్దే కృష్ణ ఉండేవారు. నరేష్ జీవితాన్ని కృష్ణ దగ్గర్నుండి చూశారు. నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తుండగా ఆయన మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద రచ్చ చేసింది. ఈ వివాదంలో మహేష్, కృష్ణల పరువుపోతుందనే ఒక వాదన ఉంది.

    నాలుగేళ్లకు పైగా పవిత్రతో నరేష్ సహజీవనం చేస్తున్నాడు. నరేష్-పవిత్రల బంధాన్ని మహేష్, కృష్ణ ఎలా చూశారనే ఒక సందేహం ఉంది. దీనిపై నరేష్ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… మేమంతా ఒక కుటుంబం. ఒక మాట మీదే ఉంటాము. మా కుటుంబం పవిత్రను అంగీకరించారు. కృష్ణ పవిత్ర లోకేష్ వంటలను ఎంతో ఇష్టంగా తినేవారు. ఆమె చేతి వంట అంటే ఆయనకు ఇష్టం. పవిత్ర లోకేష్ ని కుటుంబ సభ్యులు అంగీకరించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది అన్నారు.

    పవిత్ర మాట్లాడుతూ… నాకు తెలుగు తెలియదని కృష్ణ ఇంగ్లీష్ లో మాట్లాడేవారని అన్నారు. పవిత్ర, నరేష్ మాటల ప్రకారం తమ కుటుంబ సభ్యులైన మహేష్, కృష్ణ, విజయనిర్మల పవిత్రతో సహజీవనానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కాగా గత ఏడాది కృష్ణ మరణించారు. అప్పుడు నరేష్-పవిత్ర లోకేష్ అన్నీ తామై వ్యవహరించారు. కృష్ణ భౌతిక కాయం వద్ద వారిద్దరే కనిపించారు. విజయనిర్మల మరణం తర్వాత కూడా కృష్ణ నరేష్ వద్దే ఉన్నట్లు సమాచారం.

    ఇక మీ ఇద్దరికీ పరిచయం ఎలా? ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు? అని అడగ్గా… ఎప్పటి నుండో పరిచయం ఉంది. చాలా ఏళ్ల క్రితమే కలిసి పని చేశాము. హ్యాపీ వెడ్డింగ్ మూవీ చేస్తున్నప్పుడు మనసులు కలిశాయని నరేష్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇది డెస్టినీ. మేమిద్దరం కలవాలని ఉంది. నాకు అమ్మా నాన్నలే స్ఫూర్తి అని నరేష్ అన్నారు. కృష్ణ-విజయనిర్మల సైతం బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకోగా వారి బాటలోనే మేము అన్నట్లు నరేష్ మాట్లాడారు.