Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తారు. కాబట్టి వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది…ఎక్కువసేపు సెట్ లో కలిసి ఉంటారు. అలాగే ఒకరి విషయాలను మరొకరు షేర్ చేసుకుంటూ మంచి ఫ్రెండ్స్ గా మారి, ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు సైతం చాలామంది ఉన్నారు. మహేష్ బాబు నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబుకు పెళ్లి కాకముందు అతన్ని కొంతమంది హీరోయిన్లు ప్రేమించారు అనే వార్తలు కూడా వస్తున్నాయి… ‘అతడు’ సినిమా చేసిన సమయంలో మహేష్ బాబు యొక్క బిహేవియర్ ఆయన పాటించే పద్ధతులను చూసి త్రిష అతన్ని ప్రేమించిందట. నిజానికి ఆమె వన్ సైడ్ లవర్ గానే మిగిలిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి ఒక అమ్మాయికి హస్బెండ్ ఎలా ఉండాలి అనేదానికి మహేష్ బాబు ను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అని ఆమె తన సన్నిహితుల దగ్గర తెలియజేసేదట.మొత్తానికైతే అదే సంవత్సరంలో మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడైపోయాడు…
ఇక సమంతకు సైతం ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఉండదని, తనకు పెళ్లి కాకపోయి ఉంటే నేనే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ ఆమె ఒకానొక సందర్భంలో తెలియజేసిందట… మొత్తానికైతే సమంతకి కూడా మహేష్ బాబు అంటే క్రష్ ఉందని ఆమె చెప్పడం విశేషం…ఇక మరి కొంతమంది హీరోయిన్లు సైతం మహేష్ బాబు గురించి చాలా గొప్పగా చెప్పారు. మహేష్ బాబు ఎంత ఒబిడియెంట్ గా ఉంటాడో, అంతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఉంటాడు.
తన చుట్టుపక్కల ఉన్న వారిని నవ్విస్తాడు, పంచ్ డైలాగ్ లు కూడా చెబుతాడు నిజజీవితంలో చాలా రియలిస్టిక్ గా ఉంటాడట. ఇక ఆయనకి ఎక్కువగా సిగ్గు బిడియం ఉండడంతో ఎవరితో పెద్దగా కలిసిపోవడానికి ఇష్టపడడని కొంతమంది చెబుతుంటారు. తనతో కలిసిపోయిన వాళ్లను మాత్రం చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడని చాలామంది చెబుతూ ఉండటం విశేషం…