https://oktelugu.com/

ఆర్జీవీ అనే జీవికి అవేమి పట్టవు !

కరోనా భయంతో ప్రపంచం అల్లాడిపోతోంది, సినీ లోకం మొత్తం కష్ట కాలంలో నలిగిపోతోంది, ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రం తప్ప. జనం చచ్చిపోతున్నా.. వాళ్ళ చావులో ఉన్న డ్రామా ఏమిటి అని ఆలోచించే వర్మ నుండి ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆశించడం మన అత్యాశే అవుతుందేమో. కానీ వర్మ అంటేనే ఓ వైవిధ్యమైన వ్యక్తిత్వం. ఆ విషయంలో వర్మకి రారు ఎవరు సాటి. ఏమైనా ఎవరు ఏమనుకున్నా తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ […]

Written By:
  • admin
  • , Updated On : August 26, 2020 / 06:37 PM IST
    Follow us on


    కరోనా భయంతో ప్రపంచం అల్లాడిపోతోంది, సినీ లోకం మొత్తం కష్ట కాలంలో నలిగిపోతోంది, ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రం తప్ప. జనం చచ్చిపోతున్నా.. వాళ్ళ చావులో ఉన్న డ్రామా ఏమిటి అని ఆలోచించే వర్మ నుండి ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆశించడం మన అత్యాశే అవుతుందేమో. కానీ వర్మ అంటేనే ఓ వైవిధ్యమైన వ్యక్తిత్వం. ఆ విషయంలో వర్మకి రారు ఎవరు సాటి. ఏమైనా ఎవరు ఏమనుకున్నా తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ ఎప్పుడూ ఏదొక సినిమా చేసుకుంటూ ముందుకు పోతున్నాడు వర్మ. అయితే ‘మర్డర్’ అనే సినిమా విషయంలో మాత్రం వర్మకు బాగానే ఎదురుదెబ్బలు తగిలాయి.

    Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని చేస్తున్నా అని చెప్పగానే… ఆ కథ తాలూకు వ్యక్తులు తీవ్రంగా ఈ సినిమాని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లి మొత్తానికి విజయం సాధించారు. దాంతో వర్మ ఈసారి తన బయోపిక్ ను ఎనౌన్స్ చేశాడు. దీన్నిబట్టి వర్మ మానసిక పరిస్థితి బాగాలేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాను చేయబోయే సినిమాకి వర్మ జీవితానికి ఎక్కడా పోలికలు ఉండవని.. ఇదంతా తన పేరును ఉపయోగించి సినిమాని క్యాష్ చేసుకోవాలని వర్మ చూస్తున్నాడని.. వర్మ చివరకు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదని.. వర్మ శిష్యులు పెదవి విరుస్తున్నారు.

    Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

    సమాజాన్ని అలాగే మహిళలను ఎలా గౌరవించాలో కూడా తెలియని వర్మను చూస్తే అసహ్యం వేస్తోందని.. ఇప్పటికే వర్మ వల్ల ఎన్నో బాధలను అనుభవించానని…వర్మ నీచుడు అని వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన సిద్ధూ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అదేంటో గాని, వర్మని అసహ్యించుకునేవారు ఎంతమంది ఉంటారో.. అభిమానించే వారు అంతే గొప్పగా వర్మను పొగుడుతూ ఉంటారు. కాకపోతే ఇలాంటి విమర్శలను పొగడ్తలను ఆర్జీవీ అనే జీవి పెద్దగా పట్టించుకోరు అనుకోండి అది వేరే విషయం.