Anant Ambani Pre Wedding
Anant Ambani Pre Wedding: సెలబ్రెటీలకు ఆటవిడుపు దొరకాలంటే దూర ప్రాంతానికి వెళ్లాలి. అక్కడ ఎటువంటి అభిమానుల హడావిడి కనిపించదు. మీడియా వెంటపడుతుంది అనే ఇబ్బంది ఉండదు. అందుకే సమయం దొరికినప్పుడల్లా సెలబ్రిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడ తాము చేసిన సందడిని వీడియోలు, ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం భారత కుబేరుడు ముఖేష్ అంబానీ రెండవ కుమారుడి మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు జామ్ నగర్ లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలు, దేశంలో సెలబ్రిటీలు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ముందస్తు పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ప్రకారం ఆ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆట, పాటలతో సందడి చేస్తున్నట్టు అవగతమవుతోంది.
ముందస్తు పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం దాండియా నిర్వహించారు. ఈ వేడుకలకు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. కోడ్ ప్రకారం డ్రెస్ లు ధరించి దాండియా ఆడారు. ఈ కార్యక్రమానికి టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సతీ సమేతంగా హాజరయ్యారు. అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రావోతో కలిసి దాండియా ఆడాడు. ధోనితోపాటు అతడి భార్య సాక్షి సింగ్, పలువురు ప్రముఖులు ఉత్సాహంగా దాండియా ఆడారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్, అతడి సతీమణి ఉపాసన కూడా ఈ దాండియా కార్యక్రమానికి హాజరయ్యారు.
దాండియా వేడుకలో భాగంగా రామ్ చరణ్, ధోని సరదాగా ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో స్నేహం ఉంది. గతంలో టీ మీడియా హైదరాబాదులో ఆడినప్పుడు రామ్ చరణ్ తేజ్ జట్టు సభ్యులకు తన ఇంట్లో విందు ఇచ్చాడు. అనంతరం దాండియాలో భాగంగా వారిద్దరూ సరదాగా స్టెప్పులు వేస్తూ అలరించారు. ఇక ఈ దాండియా కార్యక్రమాని కంటే ముందు అనంత్ అంబానీ, తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి మాట్లాడాడు. అతడు మాట్లాడిన మాటలకు ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు.. కుటుంబం అండగా నిలిచిన తీరు.. రాధికా మర్చంట్ అందిస్తున్న ప్రోత్సాహం అన్నింటి గురించి అనంత్ అంబానీ చెప్పుకొచ్చాడు.
MS Dhoni with south superstar Ram Charan#MSDhoni pic.twitter.com/bqMyekU9PT
— THE AJAY Cric (@TheCric_AJAY) March 3, 2024
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Mahendra singh dhoni and ram charan in the same frame the video is going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com