WTC Rankings: భారత్ మళ్లీ నెంబర్ వన్ అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో తిరిగి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టును తొలి టెస్ట్ మ్యాచ్లో 172 పరుగుల తేడాతో ఓడించడం భారత్ కు వరమైంది.. మొన్నటిదాకా రెండవ స్థానంలో భారత జట్టు కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో రోహిత్ సేన విన్నింగ్ రేట్ 64.58 శాతానికి చేరుకుంది. ఫలితంగా మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ధర్మశాల లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలిస్తే అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో ట్రోఫీ దక్కించుకుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన భారత జట్టు.. ఆ తర్వాత వేగంగా పంచుకుంది. విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచి టెస్టుల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించింది. కప్ కూడా సొంతం చేసుకుంది.. స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ భారత జట్టు అన్ని రంగాల్లో మెరుగైన ప్రతిభ చూపి కప్ దక్కించుకుంది. ముఖ్యంగా రాజ్ కోట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ 400కు పై చిలుకు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. దీని ద్వారా టెస్టుల్లో భారీ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ధర్మశాలలో చివరి టెస్ట్ ఆడే భారత్.. ఇందులోనూ గెలిస్తే ర్యాంకును మరింత పదిలం చేసుకుంటుంది.
ఆస్ట్రేలియా రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తోంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 72 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. తద్వారా 1-0 లీడ్ లోకి వెళ్ళింది.. అంతకుముందు న్యూజిలాండ్ సొంత మైదానంలో ఆ జట్టుతో జరిగిన మూడు టి20 ల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు 3-0 తేడాతో గెలుచుకుంది. కాగా, భారత్ మొదటి స్థానాన్ని చేరుకోవడం పట్ల ఆటగాళ్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.