Mahavathar Narasimha 200 Crore Club: చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాలను వన్ సైడ్ గా డామినేట్ చేస్తూ, కనీవినీ ఎరుగని రేంజ్ ట్రెండ్ ని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా'(Mahavatar Narasimha). ఇండియా లో ఒక యానిమేటెడ్ చిత్రం ఇంతలా ప్రభంజనం సృష్టించగలదా?, కంటెంట్ పవర్ కి జనాలు దాసోహం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. వర్కింగ్ డే రోజున 19 రోజుల క్రితం విడుదలైన సినిమాకు ఈ రేంజ్ ట్రెండ్ కనబడడం ఈ మధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలకు కూడా చూడలేదు. ఓటీటీ వల్ల జనాలు థియేటర్స్ కి రావడం లేదంటూ నిందలు వేయడం కాదు, దమ్ముంటే సరైన సినిమా తియ్యండి అంటూ ఆడియన్స్ ఈ సినిమా ద్వారా మరోసారి నిర్మాతలకు చెప్పకనే చెప్పారు.
Also Read: ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రసంగం ప్రణాళిక ప్రకారమే ఇచ్చాడా..? టీడీపీ నే టార్గెట్ చేశాడా?
ఇకపోతే ఈ చిత్రం లేటెస్ట్ గా 200 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. చాలా మంది సూపర్ స్టార్స్ ఇప్పుడిప్పుడే ఈ క్లబ్ లోకి కొత్తగా చేరుతున్నారు. ఇంకా కొంత మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళకంటే ముందుగా ఈ చిత్రం ఈ ప్రెస్టీజియస్ క్లబ్ లోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లుండి రెండు పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రం అత్యధిక సెంటర్స్ లో థియేటర్స్ ని హోల్డ్ లో పెట్టుకుంది. ఒకేవేళ ఎల్లుండి విడుదల అవ్వబోయే రెండు సినిమాల్లో ఏ ఒక్క దానికి ఫ్లాప్ టాక్ వచ్చినా, నరసింహ స్వామీ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తాండవిస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వరకు వచ్చాయట. ఈ ఏడాది నిర్మాత అల్లు అరవింద్ పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. ఆయన నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ‘తండేల్’, ‘సింగిల్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అదే విధంగా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ‘చావా’, ‘మహావతార్ నరసింహా’ చిత్రాలు ఇంకా ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. అలా గీత ఆర్ట్స్ ఎప్పుడూ చూడనంత పీక్ రేంజ్ ని ఈ ఏడాది లో చూస్తుంది. మహావతార్ నరసింహా చిత్రాన్ని కేవలం మూడు కోట్లకు కొనుగోలు చేశారు. 17 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయని టాక్.