NTR War 2 Speech: రీసెంట్ గా జరిగిన ‘వార్ 2′(War 2 Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కేవలం సినీ వర్గాల్లో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్(Junior NTR) తన ప్రసంగం లో 25 ఏళ్ళ సినీ జీవిత ప్రయాణం గురించి, తనతో కలిసి నడిచిన వారి గురించి ఆయన ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ షూటింగ్ మొదటి రోజున నా పక్కన మా అమ్మానాన్నలు మాత్రమే ఉన్నారని, అలా వాళ్ళ సపోర్టు తో, రామోజీ రావు గారి ఆశీస్సులతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టానని, వాళ్ళ తర్వాత నన్ను అభిమానులే నడిపించి ఇంత దూరం తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. ఎక్కడా కూడా బాలయ్య పేరు ని ప్రస్తావించలేదు, అదే విధంగా తనతో రామోజీ రావు మొదటి సినిమా చేసేలా ప్రేరేపించిన ప్రస్తుత ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరుని కూడా ప్రస్తావించలేదని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా లో ఎన్టీఆర్ పై భగ్గుమంటున్నారు.
Also Read: పరమ్ సందరి ట్రైలర్ : అల్లు అర్జున్ సహా సౌత్ హీరోలను వాడేశారుగా…
ఎన్టీఆర్ కి కెరీర్ ప్రారంభం నుండి నందమూరి మరియు నారా కుటుంబాల సపోర్టు మెండుగా ఉందని, వాళ్ళ కారణంగానే ఆయనకు కెరీర్ ప్రారంభం లో అవకాశాలు వచ్చాయని, ఆరోజుల్లో ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో బాలయ్య గురించి గొప్పగా చెప్పుకొచ్చేవాడని, ఇప్పుడు ఆయనకంటూ ఒక స్థానం వచ్చే లోపు అందరినీ మర్చిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో దూరం పెట్టేసాడు. నందమూరి తారకరత్న దినం రోజున బాలకృష్ణ వాళ్ళిద్దరిని ట్రీట్ చేసిన విధానంని బట్టే ఈ విషయం చెప్పొచ్చు. ఎప్పుడైతే బాలయ్య ఆరోజు అలా ప్రవర్తించాడో, అప్పటి నుండి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా నందమూరి బాలకృష్ణకు, నారా కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రాలేదు,అదే విధంగా నారా రోహిత్ పెళ్ళికి కూడా ఆయన హాజరు కాలేదు.
అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ వీళ్లకు దూరంగా ఉంటున్నాడని, అయితే మొన్న ఎన్టీఆర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ వెనుక చాలా అర్థాలు దాగి ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. చూస్తుంటే ఆయన రాజకీయ అరంగేట్రం పక్కా లాగానే ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లోనే ఆయన కొత్త పార్టీ ని స్థాపించే అవకాశాలు కూడా ఉన్నాయట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేతిలో తెలుగు దేశం పార్టీ బాధ్యతలు పెడుతాడో, అప్పుడే ఎన్టీఆర్ కొత్త పార్టీ ని స్థాపించే అవకాశం ఉందని అంటున్నారు. నారా లోకేష్ నాయకత్వం ఇష్టంలేని తెలుగు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు మరియు ఇతర కార్యకర్తలు మొత్తం ఎన్టీఆర్ పెట్టే కొత్త పార్టీ కి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదంతా ఎంత వరకు సాధ్యం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినీ కెరీర్ పీక్ రేంజ్ లో ఉంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఆయన సినిమాలు తీస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు.