OG Teaser: ఈ ఏడాది విడుదల అవ్వబోతున్న క్రేజీ పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనమంతా చూశాము. ముఖ్యంగా ఈ లిరికల్ వీడియో సాంగ్ లోని విజువల్స్ ని చూసి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ మెంటలెక్కిపోయారు. డైరెక్టర్ సుజిత్ విజన్ కి సలాం కొట్టారు. కచ్చితంగా ఈ సినిమాతో కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని మెజారిటీ అభిమానులకు అందించాడు డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రంతో. కానీ ఎంతైనా ‘హరి హర వీరమల్లు’ చేసిన గాయం పచ్చిగానే ఉంది. ఇలాంటి సమయం లో కొంతమంది అభిమానులు పూర్తి స్థాయిలో ఓజీ మీద కూడా నమ్మకాలు పెట్టుకోలేదు.
Also Read: ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రసంగం ప్రణాళిక ప్రకారమే ఇచ్చాడా..? టీడీపీ నే టార్గెట్ చేశాడా?
అలాంటి అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, వాళ్లకు ఈ నెల 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోయే టీజర్ తో అదిరిపోయే రేంజ్ సమాధానం దొరుకుతుందని అంటున్నారు నెటిజెన్స్. ఓజీ మీద ఎలాంటి అపనమ్మకాలు ఉన్నా ఆ ఒక్క యాక్షన్ టీజర్ కట్ తో వారిలోని ఆ అపనమ్మకాలు తొలగిపోతాయని అంటున్నారు. అంతటి అద్భుతమైన టీజర్ కట్ ని సిద్ధం చేసి పెట్టారట. ఇందులో పవన్ కళ్యాణ్ కొట్టే డైలాగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటాయట. పవన్ కళ్యాణ్ లాంగ్ లెంగ్త్ డైలాగ్స్ కంటే, షార్ట్ డైలాగ్స్ చాలా బాగుంటాయి, అలాంటి డైలాగ్స్ నే ఈ టీజర్ లో ఆయన చేత కొట్టించారట. ఇప్పటికే అభిమానులు ఫైర్ స్ట్రోమ్ మేనియా నుండి బయటకి రాలేదు. రోజుకి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఆ పాట ముందుకు దూసుకుపోతుంది.
సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రమే కాదు, బయట మాస్ మరియు యూత్ ఆడియన్స్ కి కూడా ఈ పాట బాగా నచ్చింది. పైగా రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేసే హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ లో కూడా ఈ పాట ని వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ పాట మంచిగా రీచ్ అయ్యింది. ఇప్పుడు ఆగష్టు 15 న విడుదల చెయ్యబోయే యాక్షన్ టీజర్ కట్ కూడా క్లిక్ అయితే ఇక ఓజీ సినిమా హైప్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో మీరే ఊహించుకోండి. పవన్ కళ్యాణ్ సినిమాకు అభిమానులు కాకుండా మామూలు ఆడియన్స్ ఈ రేంజ్ లో హైప్ అవ్వడం చూసి పదేళ్లు అయ్యింది. హైప్ కి తగ్గట్టు సినిమా కూడా అదిరిపోతే ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మేనియా ఎలా ఉండబోతుంది అనేది.