Megastar Chiranjeevi: మొన్న రాజమండ్రి లో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానులకు ఎలాంటి తీపి జ్ఞాపకాలను మిగిలించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, చిరంజీవి గురించి ఎంతో బావోద్వేగపూరిత ప్రసంగంని అందించాడు. ఆ మరుసటి రోజే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంచుమించు అలాంటి ప్రసంగాన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రామ్ చరణ్ ని ఉద్దేశించి ఇచ్చాడు. నిన్న సాయంత్రం ఆయన ‘ఆప్త క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్’ సమావేశం లో పాల్గొన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కి సంబంధించిన ఈ కంపెనీ వ్యవస్థాపకులు మెగాస్టార్ చిరంజీవి కి అత్యంత సన్నిహితులు. వాళ్ళు ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే నిన్న ఆయన అతిథిగా వచ్చి ఆప్త టీం కి శుభాకాంక్షలు తెలియచేసాడు.
ఈ సందర్భంలో ఆయన జీవితంలో సాధించిన విజయాలను, అందుకు ఆయన చేసిన కృషి ని తెలిపి, యువతని ఉత్తేజ పరిచే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘నేను నా జీవితం లో సాధించిన అఛీవ్మెంట్స్ గురించి ఇందాక చెప్పుకొచ్చాను. కానీ అసలు సిసలు అఛీవ్మెంట్స్ ని నేను చెప్పడం మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ నా అఛీవ్మెంట్, రామ్ చరణ్ నా అఛీవ్మెంట్, నా ఇంట్లో ఈరోజు ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన నా బిడ్డలందరూ నా అఛీవ్మెంట్స్. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు నాతో ఒక మాట అన్నాడు. అన్నయ్య నువ్వు అప్పట్లో ఒక మాట అన్నావు గుర్తుందా? అన్నాడు. ఏమిట్రా అది అని నేను అడిగితే, సౌత్ లో మన మెగా ఫ్యామిలీ బాలీవుడ్ లోని రాజ్ కపూర్ ఫ్యామిలీ లాగా అన్ని తరాల వారు సక్సెస్ అవ్వాలి, మెగా లేజసీ ని ముందుకు సాగించాలి అన్నావు’.
‘అందరి మంచి కోరుకునే వాడివి. ఏదైనా కల్మషం లేకుండా నిజాయితీగా కోరుకుంటావు కాబట్టే, ఈరోజు అదే జరిగింది అన్నాడు. అప్పుడు నేను ఆలోచిస్తే నిజమే కదా అని అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక ‘మెగా ఫ్యామిలీ ఈజ్ ది కపూర్ ఫ్యామిలీ అఫ్ సౌత్ అని ఒక కథనం ని ప్రచురించారు. దానిని చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందం కలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. రామారావు గారితో పని చేసిన నిర్మాతలు, ఆయన సినిమాలు వదిలి వెళ్లిపోయిన తర్వాత నాతో చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. అప్పుడే అనుకున్నాను నేను నెంబర్ 1 హీరో అని, కానీ నేనే నెంబర్ 1 అని గర్వం తో కాలర్ ఎగరేస్తే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. అందుకే ఎంత ఎత్తు ఎదిగినా నెంబర్ గేమ్స్ ని పట్టించుకోలేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోయాను అంటూ మెగాస్టార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
#Chiranjeevi :#PawanKalyan is my achievement, #RamCharan is my achievement…నా family లో ఉన్న అందరు బిడ్డలు నా achievement!
మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు……అన్నయ్య ఒక మాట అనేవాడివి గుర్తుందా … మరొక రాజ్ కపూర్ ఫామిలీ మన Mega ఫామిలీ అవ్వాలి అని… pic.twitter.com/KsLUi0SOxN
— Gulte (@GulteOfficial) January 5, 2025