Maharaja Movie Review: మహారాజా మూవీ రివ్యూ…

Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ చిత్రం గా రావడం విశేషం...అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : June 14, 2024 10:47 am

Maharaja telugu movie review

Follow us on

Maharaja Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వైవిద్య కథాంశాలతో సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే మనం అలాంటి చాలా సినిమాలను చూసి ఆదరించాము. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా ‘మహారాజా ‘ అనే మరొక సినిమాతో మన ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి 50వ చిత్రం గా రావడం విశేషం…అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మహారాజా(విజయ్ సేతుపతి) అనే ఒక వ్యక్తి సెలూన్ షాపును నడుపుకుంటూ ఉంటాడు. తన కూతురు అయిన లక్ష్మితో తనకు చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. అనుకోని కొన్ని కారణాలవల్ల తన కూతురు లక్ష్మి మిస్ అవుతుంది. తను పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెడతాడు. దాంతో ఆ అమ్మాయి ఎందుకు మిస్ అయింది. అని ఒక క్యూరియాసిటీతో ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఆ అమ్మాయి ఎందుకు మిస్ అయింది. మళ్ళీ దొరికిందా లేదా అనే విషయాలు మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ ఈ సినిమాని ఏ ఉద్దేశ్యంతో అయితే తీయాలి అనుకున్నాడో తను అనుకున్న వే ని పర్ఫెక్ట్ గా పోట్రే చేశాడు. ఇక నిజానికైతే ఈ సినిమాలో స్ట్రాంగ్ బలం ఏంటి అంటే రైటింగ్.. ప్రతి సీన్ లో సినిమా తాలూకు ఇంటెన్స్ ని చెడగొట్టకుండ చాలా అద్భుతంగా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సీన్లు ఒళ్లు జలదరించేలా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయింది. ఇక ముఖ్యంగా విజయ్ సేతుపతి యాక్టింగ్ తోనే ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు.

కథ పరంగా స్ట్రాంగ్ గా ఉన్న ఈ సినిమా విజువల్స్ పరంగా మాత్రం ఒక సీరియల్ టెంప్లేట్ లో సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ ప్రేక్షకుడు సినిమాలో ఉన్న కథని మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో సినిమా మొత్తాన్ని చూస్తూ ఉంటాడు. నిజానికైతే కథ ఉంటే విజువల్స్ పెద్దగా లేకపోయిన కూడా సినిమా వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను చాలా స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో రాసుకున్న ట్విస్ట్ లు మాత్రం సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగా హైలైట్ అయ్యాయి…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా లేకపోయినప్పటికీ సినిమా రైటింగ్ లో ఉన్న ఫ్రెష్ నెస్ అనేది సినిమా సక్సెస్ లో చాలా కీలక పాత్ర వహించిందనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఈ సినిమాని తన భుజాల మీద మోసుకొని తీసుకెళ్లడనే చెప్పాలి. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాల్లోని నటన ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఆయన చూపించిన నటన నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇక తన కూతురు కోసం తను పడే వేదన ఒక సగటు తండ్రి ఎలా అయితే బాధపడతారో అలాంటి ఒక బాధని చూపిస్తూనే సినిమాను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు…ఇక ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషించిన మమతా మోహన్ దాస్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పాత్రలో నటించి మెప్పించింది.

ఇక బాలీవుడ్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం అనేది గొప్ప విషయం…ఇక తన పాత్ర ఏంటి అనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది… ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు అయితే ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమాలో టెక్నికల్ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కథలో ఉన్న ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి ప్రేక్షకుడిని సినిమాకి ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది అందువల్ల ఈ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక విజువల్ గా సినిమా చూస్తున్నప్పుడు టీవీ సీరియల్ ని చూస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది.

మరి అలా ఎందుకు తీసారో ఎందుకు విజువల్స్ మీద అంత పెద్దగా ఫోకస్ చేయలేదో మనకి తెలీదు కానీ ఈ సినిమా మాత్రం చాలా వీక్ గా ఉందనే చెప్పాలి. కొన్ని సస్పెన్స్ గొలిపే సీన్స్ లో అద్భుతంగా ఉంది…ఇక మొత్తానికైతే విజయ్ సేతుపతి నుంచి వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అలాగే మరోసారి తను మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు…

ప్లస్ పాయింట్స్

విజయ్ సేతుపతి యాక్టింగ్..
సినిమా రైటింగ్ చాలా బాగుంది…
ట్విస్ట్ లు..

మైనస్ పాయింట్స్

విజువల్స్

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చె రేటింగ్ 2.75/5

చివరి లైన్
విజయ్ సేతుపతి మరోసారి సూపర్ హిట్ సాధించాడు…