Mahalakshmi Divorce
Mahalakshmi Divorce: ” శ్రీరస్తు.. శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఇక ఆకారం దాల్చ మంటుంది కొత్త జీవితం..” పెళ్లి పుస్తకంలోని ఈ సినిమా పాట మీకు గుర్తుందా! ఇప్పటికీ కూడా పెళ్లిళ్లల్లో ఈ పాటను ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఈ పాటలో ఆకారం గురించి ఎందుకు చెప్పారో తెలియదు కానీ.. నూతన వధూవరుల్లో ఎవరి ఆకారం కొంచెం ఎక్కువగా ఉన్నా కచ్చితంగా వికారం కలుగుతుంది.. అలాంటి భారీ ఆకారుడైన ఓ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్, బుల్లితెర నటి మహాలక్ష్మి గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అతడేమో అత్యంత భారీగా ఉంటాడు. ఆ అమ్మాయి చాలా అందంగా, నాజుకు గా ఉంటుంది. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. యూట్యూబ్లో కూడా వీరి గురించి విపరీతమైన చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
మహాలక్ష్మి తమిళనాడులో పేరొందిన యాంకర్. రవీందర్ చంద్రశేఖరన్ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత. పైగా అత్యంత భారీ కాయుడు. అయితే వీరిద్దరూ అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద సంచలనంగా మారింది. పైగా వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. ప్రేమించినప్పటికీ పెద్దల అంగీకారంతోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ వీరిద్దరిపైన ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకపక్క రవీందర్ ను బాడీ షేమింగ్ చేస్తూనే.. మరో పక్క అతడిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావని మహాలక్ష్మిని విమర్శిస్తూ ఉంటారు. అయితే వారందరి నోటికి తాళం వేసేందుకు మహాలక్ష్మి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమధ్య తమిళనాడుకు చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారిద్దరూ విడిపోయారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఇది కొంతవరకు ఆ దంపతులకు ఇబ్బంది కలిగించలేదు. కానీ ఇటీవల అది శృతి మించి పోవడంతో వారు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఈ క్రమంలో మహాలక్ష్మి తన భర్తతో తాజాగా ఒక ఫోటో దిగింది. దానిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ” నువ్వు నా ధైర్యం. నువ్వు నా భుజం మీద చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలను అనే భరోసా వస్తుంది. నా మనసు మొత్తం నువ్వే నిండిపోయావు. అమ్మూ ఐ లవ్ యు” అని చాలా ఉద్వేగంగా రాసుకుంది.. దీనిని చూసిన రవీందర్ చంద్రశేఖరన్ మురిసి పోయాడు. తను కూడా ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ” చాలామంది మీరు విడాకులు తీసుకున్నారు అని చెబుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ వారైతే ఈ ఏకంగా విడిపోయారు అంటూ అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోతో మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఫోటోలో మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు అనిపిస్తోంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.