Maha Samudram Movie Trailer: టాలీవుడ్ లో సీరియస్ క్రైం స్టోరీలు వచ్చినవే తక్కువ. అయితే పంతాలు పట్టింపులు.. గొడవలు.. ముఠాలపై సినిమాలు వచ్చినా కానీ వాటిపై ప్రేక్షకుల అభిరుచి మాత్రం ఇప్పటికీ మారలేదు. భీకర విలన్లతో ఇద్దరు హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ తలపడ్డ తీరును వివరిస్తూ కొద్దిసేపటి క్రితం విడుదలైన ‘మహాసముద్రం’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆర్ఎక్స్100 మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మహాసముద్రం’ చిత్రం ట్రైలర్ భీకరంగా ఉంది. అదితిరావు హైదరి, అనుఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ట్రైలర్ చూస్తే ప్రధానంగా ‘ప్రేమ’, దాని చుట్టూ అల్లుకున్న యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగినట్టుగా తెలుస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ తుపాకులు పట్టి పోరాడుతున్న సీన్లు హైలెట్ గా ఉన్నాయి. ఇక విలన్లు రావు రమేశ్, జగపతిబాబు జీవించేశారు. రావు రమేశ్ అయితే ఒక చేయి పైకి పెట్టి డిఫెరెంట్ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్స్ అయితే ప్రేక్షకుల చేత ఈలలు వేయించేలా కనిపిస్తున్నాయి.
ఒకే ఫ్రేమ్ లో శర్వానంద్, సిద్ధార్థ్ లు కనిపించి సందడి చేశారు. ఇద్దరూ పోటీపడి నటించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సముద్రం చుట్టూ అల్లుకున్న క్రైం మాఫియాగా సినిమా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది.
ఇద్దరూ హీరోలు ఈ సినిమాలో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. నేపథ్య సంగీతం కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. డైలాగులు అయితే అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు అజయ్ భూపతి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ చూస్తేనే అంచనాలు పెంచేలాగా కనిపిస్తోంది.
-ట్రైలర్ ను కింద చూడొచ్చు.