
త్రిపాఠి, వెంకటేశ్ మెరుపులతో ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ లో కేకేఆర్ మరో విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆరంభంలో రోహిత్, డికాక్ లు శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. అయితే డికాక్ 55 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ లో పెద్దగా రాణించలేకపోయారు.
చివర్లో పొలార్డ్ 21, కృనాల్ 12 పరుగులతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబై నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృిష్ణ, లోకి ఫెర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఓవర్ కు 9కి తగ్గకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ అర్ధ సెంచారీతో ఆకట్టుకోగా.. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్, 42 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు నిలిచి కేకేఆర్ కు ఘన విజయాన్ని అందించాడు.
ముంబై బౌలర్లలలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. తాజా విజయంతో కోల్ కతా 9 మ్యాచ్ ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో నాలుగో స్థానానికి చేరుకోగా.. వరుసగా రెండో ఓటమితో ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది. వెంటేశ్ అయ్యార్.. రాహుల్ త్రిపాఠి విధ్వంసానికి బలమైన ముంబాయి బౌలింగ్ దళం తేలిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.