Bigg Boss 9 Telugu: నిన్న బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లో మంచిగా అందరితో కలిసిపోయారు, ఒక్క దివ్వెల మాధురి తప్ప. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టగానే శ్రీజ తో చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఈమె పేరు ఆమెకు తెలియకపోవడం, మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగినందుకు ఆమె అహం దెబ్బ తినింది. రాగానే నాతో గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నావా అంటూ సీరియస్ గా మాట్లాడింది. ఈమెకు ఈమె పెద్ద స్టార్ హీరోయిన్, సూపర్ స్టార్ అని ఫీల్ అయ్యిందో, లేకపోతే ఆమె ఏ ప్రధాన మంత్రి సతీమణి అనుకుంటుందో?, లేకపోతే ముఖ్యమంత్రి తాలూకా అనుకుంటుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. నిన్నటి సంగతి పక్కన పెడితే, కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది, అందులో కూడా ఈమె కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో గొడవ పడింది.
విషయం ఏమిటంటే వంటింట్లో ఉన్న దివ్వెల మాధురి ని పవన్ కళ్యాణ్ పిలిచి, కూర్చోండి మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు మాధురి కూర్చోనవసరం లేదు, మళ్లీ నేను అక్కడికి వెళ్ళాలి, కూర్చోకపోతే ఊరుకోరా అని చాలా బలుపుగా సమాధానం చెప్తుంది. ఇక ఆ తర్వాత వంట గురించి మాట్లాడుతూ ఈరోజు అయితే ఇలా ఉంది, రేపటి నుండి షెడ్యూల్ ఇలా ఉండదు అని అంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మాధురి దానికి సమాధానం చెప్తూ ‘నేను అక్కడికి వచ్చి అరగంట కూర్చున్నాను, ఎప్పుడేమి చేశారు మీరు?, ఆలస్యం అవ్వుద్ది అని అప్పుడు తెలియలేదా’ అని అంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ‘మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది’ అని అంటాడు. దానికి ఆమె మాట్లాడండి అని మళ్లీ పొగరుగా సమాధానం చెప్తుంది.
Video Link: https://www.youtube.com/
ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన తప్పేమి లేదు, ఇంటికి కొత్తగా వచ్చింది, పైగా వంట బాధ్యతలు తీసుకుంది, షెడ్యూల్ ని వివరించాలి అనే ప్రయత్నం చేసాడు. ఎందుకంటే ఆమె వంట చాలా ఆలస్యం గా మొదలు పెట్టింది. అందరూ ఆకలితో ఉన్నారు. మంచిగా, మర్యాదగా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఆమె అడుగడుగునా అహంకారం చూపించింది. ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాను, నాతో జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈమె మాత్రం ఇష్టమొచ్చినట్టు బలుపుగా సమాధానం చెప్పొచ్చు, ఈమెకు ఎవరైనా అదే టోన్ లో సమాధానం ఇస్తే ‘ఏయ్..ఏంటి గొంతు పెంచుతున్నావ్?’ అని నోరు పారేసుకుంటుంది. ఇది ఆమె సొంత ఇల్లు అనుకుంటుందో, లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో అసలు అర్థం కావడం లేదు. ప్రవర్తన మార్చుకోకుంటే, వచ్చే వారం ఈమె ఆడియన్స్ బయటకు గెంటేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు.