టాలీవుడ్ లోనే సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఒకప్పుడు చిరంజీవి నుంచి బాలయ్య సహా అగ్రహీరోలందరికీ సంగీతం అందించిన కీరవాణి ఇప్పుడు 60 ఏళ్లు రావడంతో ఇక సంగీతానికి రెస్ట్ ఇచ్చిన తన తమ్ముడు రాజమౌళి సహా రాఘవేంద్రరావు, క్రిష్ సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందిస్తున్నాడు. బయట సినిమాలకు పనిచేయడం లేదు.
ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ శంకర్ దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి కీరవాణి చాలా రోజుల తర్వాత సంగీతం సమకూర్చారు. ఇక తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ రెండో సినిమాగా ‘పెళ్లి సందD’ని తీశాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఒకప్రేమ పాట వైరల్ అయ్యింది. తాజాగా మరో రోమాంటిక్ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీలీల, రోషన్ పై మధురమైన ‘మధురానగరిలో’ అని సాగే పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 22న ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా ‘మధుర నగరిలో’ అని వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రీనిధి, నయననాయర్, కాలభైరవ పాడారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ లో షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి , రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.