Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. తన కన్నా దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ప్రియాంక- నిక్ జంట దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉంటాయి. పెళ్లి తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లకు నిక్ పేరుని కూడా చేర్చిన ప్రియాంక ఇటీవల తన ఖాతాలకు నిక్ పేరుని తీసివేసి ప్రియాంక అని మార్చింది.

దీంతో ప్రియాంక తన భర్త నుంచి విడిపోతుందా అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మేరకు సోషల్ మీడియా లో కూడా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించింది. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ ల విడాకుల వార్తలపై ఆమె స్పందించారు. విడాకుల వార్తలు అవాస్తవం అని… ఆ వార్తలను ఖండిస్తున్నట్లు మధు చోప్రా తెలిపారు. ఆ వార్తలు అన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ప్రియాంక నిక్ తో చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ తరహా అసత్య ప్రచారాలను ప్రియాంక అభిమానులు నమ్మవద్దు అని కోరారు. మరి ఈ విడాకుల వార్తలపై ప్రియాంక ఎలా స్పందిస్తారో అని ఆమె అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.